ప్రముఖ పొలిటీషియన్ టీడీపీలోకి ఎంట్రీ..?

Written By Xappie Desk | Updated: January 26, 2019 18:18 IST
ప్రముఖ పొలిటీషియన్ టీడీపీలోకి ఎంట్రీ..?

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన రాయలసీమ ప్రాంతానికి చెందిన కర్నూలు జిల్లా నాయకుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోట్ల విజయభాస్కరరెడ్డి కుమారుడు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి త్వరలో తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న టాక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమైన పవనాలు వీస్తున్న గాని ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కోరుకుంటున్నట్లు ఇందుమూలంగా త్వరలో టిడిపిలోకి రాబోతున్నట్లు కర్నూలు జిల్లా రాజకీయాల్లో వినపడుతున్న టాక్.
 
కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి రాజకీయ ప్రయాణం గమనిస్తే గతంలో కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు వస్తున్న క్రమంలో ప్రస్తుత సమాచారం ప్రకారం కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి త్వరలో అమరావతి లో చంద్రబాబుతో భేటీ అయి తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రకటిస్తున్న పథకాలు మరియు హామీలు ప్రజలకు ఎంతగానో మేలు చేకూరుస్తాయని బలంగా నమ్ముతున్నారు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి. దీంతో రాబోయే ఎన్నికల్లో కూడా చంద్రబాబు మళ్లీ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన గెలిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం.
Top