భారీ వ్యూహాన్ని సిద్ధం చేసిన జగన్..!

Written By Xappie Desk | Updated: January 26, 2019 18:23 IST
భారీ వ్యూహాన్ని సిద్ధం చేసిన జగన్..!

తన ప్రజా సంకల్ప పాదయాత్ర తో రాజకీయ ముఖచిత్రాన్ని ఆంధ్రరాష్ట్రంలో మార్చేసిన వైసీపీ అధినేత జగన్ పొలిటికల్ కెరియర్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా పెద్ద హాట్ టాపిక్ అయింది. ఢిల్లీలో పెద్ద పెద్ద తలకాయలకు మర్చిపోయే టట్లు రాజకీయ అడుగులు వేస్తూ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ని ముప్పుతిప్పలు పెడుతున్న జగన్ రాబోతున్న ఏపీ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచే విధంగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ఏపీ ప్రజల మన్ననలను పొందుతున్న జగన్ తాజాగా మరో వ్యూహం సిద్ధం చేసినట్లు సమాచారం.
 
ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రవ్యాప్తంగా తటస్థులుగా ఉన్న వారికి జగన్ నేరుగా లేఖలు రాయనున్నట్లు పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తటస్థులను తనతో కలుపుకునేందుకు అన్న పిలుపు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు అనే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా స్థానికంగా ప్రభావం చూపగల 70వేలు పైచిలుకు తటస్థంగా ఉన్నవారిని కలిసి సలహాలు సూచనలు జ‌గ‌న్ తీసుకోనున్నార‌ని తెలుస్తోంది. ఇక ఇప్ప‌టికే గ్రామస్థాయి వరకు తటస్థుల లిస్ట్‌ను వైసీపీ శ్రేణులు సేక‌రించార‌ని, వారి పేరుతోనే జగన్ అంద‌రికీ లేఖ రాయ‌నున్నార‌ని… ఆ లేఖ‌లో జగన్ మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారని.. ఈ నేప‌ధ్యంలో వారి సలహాలు, సూచనలు ఈ మెయిల్ ఐడీకి పంపించవచ్చని స‌మాచారం. దీంతో తాజాగా జగన్ ఈ వ్యూహంతో మరింతగా ప్రజల్లోకి దూసుకెళ్లి పోతారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.




Top