తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో తనకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో ప్రచారం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు కి త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్న ట్లు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అయితే కెసిఆర్ ఇవ్వబోతున్న రిటర్న్ గిఫ్ట్స్ గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా మంది రాజకీయ నేతలు మరియు ఇరుపార్టీల నాయకులు అనేక రకాలుగా కామెంట్లు చేశారు.
ఇదిలా ఉండగా తాజాగా ఎట్ హోం కార్యక్రమంలో రాజ్ భవన్ లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలను కెసిఆర్ ఆహ్వానించడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో సంచలనం అయింది. ముఖ్యంగా విశాఖపట్టణానికి చెందిన బడా పారిశ్రామికవేత్త సన్యాసిరావు కూడా హాజరయ్యారు. సన్యాసిరావు గులాబీ కోటుతో రాజ్‌భవన్‌కు వచ్చారు. వచ్చినప్పటి నుంచి కేటీఆర్‌తో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నించారు, కేటీఆర్ కూడా అంతే ఉత్సాహంగా వెలగడంతో... రానున్న ఏపీ ఎన్నికలలో టీఆర్‌ఎస్ టికెట్‌తో పోటీ చేయమని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.
అయితే సన్యాసిరావు ఉత్సాహన్ని చూసి, కేటీఆర్ అలా అన్నారేమో అన్న అభిప్రాయం చాలా మందిలో ఏర్పడిప్పటికీ ఇటీవలి రాజకీయ పరిణామాల్ని చూస్తే మాత్రం కేటీఆర్ అన్నది వ్యంగ్యం కాదని అర్థం అవుతుంది. ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామన్న కేటీఆర్, తెలంగాణలో టీడీపీ పోటీ చేయగా లేనిది తాము ఏపీలో ఎందుకు పోటీ చేయకూడదన్న వాదన వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఆంధ్రాలో పోటీ చేసి చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రస్తుత పరిణామాలు బట్టి అర్థమవుతుంది.