ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ హవా కొనసాగుతున్న క్రమంలో రానున్న ఎన్నికల్లో కచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టమైన సర్వేల ఫలితాలు జాతీయ సర్వేలో ను మరియు ప్రముఖ సర్వేల లోనూ ఫలితాలు వస్తున్న నేపథ్యంలో చాలా మంది భవిష్యత్తు రాజకీయాలు రాణించాలని చూస్తున్న వారు వైసిపి పార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ముందు నుండి పార్టీని నమ్ముకుని ఎవరితో అయితే గత కొంత కాలం పోరాడారో వారిని అధ్యక్షుడు జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్న క్రమంలో చాలా మంది పార్టీని నమ్ముకున్న వైసిపి నాయకులు జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల మరియు రాబోతున్న ఎన్నికల టికెట్ పట్ల ఉక్కిరి బిక్కిరి అవుతూ అసహనం చెందుతున్నట్లు సమాచారం.
ఈమధ్య ఇలానే టీడీపీ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి వైకాపాలోకి జంప్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. గత ఎన్నికల్లో తన హవా ముందు నిలిచి గెలిచిన మేడాను జగన్ కూడా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకానీ ఇన్నాళ్లు మేడాకు ఎదురునిలిచి రాజంపేటలో పార్టీని నెట్టుకొస్తున్న ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డిని గురించి ఆలోచించలేదు. ఈ నాలుగున్నరేళ్లలో అనేక రకాలుగా మేడాతో విభేదించిన అమర్ నాథ్ రెడ్డి ఇప్పుడు ఒకసారిగా ఎలా సర్దుకుంటాడని కూడా జగన్ ఆలోచించలేదు. పైగా ఈసారి రాజంపేట టికెట్ మేడాకే అనే టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో అమర్ నాథ్ రెడ్డి అసంతృప్తి చెంది అనుచరులతో సహా జగన్ వద్దకు వెళ్లగా టికెట్ పై స్పష్టమైన హామీ ఏదీ అందలేదట దీంతో జగన్ పై ఆయన తీసుకున్న నిర్ణయాలపై అసహనంతో ఉన్నట్లు సమాచారం.