ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఎట్ హోం కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సమక్షంలో రాజభవన్ లో తేనేటి విందు రెండు తెలుగు రాష్ట్రాల కు చెందిన రాజకీయ నాయకులకు ఇచ్చారు. జరిగిన ఈ కార్యక్రమానికి చాలామంది ప్రముఖ పార్టీల నాయకులు హాజరయ్యారు. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, పవన్ కళ్యాణ్, ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్క, జానారెడ్డిలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్య నేతలంతా పవన్ తో వేరు వేరుగా చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది. ముందుగా పవన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపు మాట్లాడారు. పవన్ కూడా కెసిఆర్ తో ముచ్చటించారు.
అయితే వెంటనే తర్వాత టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తో పవన్ కళ్యాణ్ నేటి అయ్యారు. దీంతో వీరిరువురి మధ్య ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో జరుగుతున్న పరిణామాల గురించి చర్చ జరిగినట్లు సమాచారం. అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఎవరికి మద్దతు తెలపకుండా తటస్థంగా ఉన్న నేపథ్యంలో రానున్న ఏపీ ఎన్నికల్లో టిఆర్ఎస్ మరియు జనసేన పార్టీ కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ కోసం టిఆర్ఎస్ పార్టీ సానుకూలంగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా కెసిఆర్ తో కలిసి ఏపీ రాజకీయాలలో సామరస్య వాతావరణం నెలకొల్పి నవతర రాజకీయాన్ని ప్రజలకు చూపించే విధంగా రాబోయే ఎన్నికలలో సరికొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు టాక్ వినపడుతుంది.