రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో దగ్గుబాటి కుటుంబానికి మంచి పేరు ఉంది. ముఖ్యంగా దగ్గుబాటి పురందేశ్వరి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో రాణిస్తున్న గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జాతీయ రాజకీయాలలో కీలకంగా వ్యవహరించింది. ఇదే క్రమంలో టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి కుమార్తె కావడంతో జాతీయ మరియు రాష్ట్ర రాజకీయాలలో దగ్గుబాటి కుటుంబానికి మంచి పేరు ఉంది. మరోపక్క ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు కూడా రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించిన క్రమంలో ప్రస్తుతం ఆయన తనయుడు దగ్గుబాటి హితేష్ పొలిటికల్ ఎంట్రీ కి సిద్ధం చేశారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ హవా కొనసాగుతున్న క్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు మరియు హితేష్ కలసి హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైసిపి అధినేత జగన్ ని కలిసి పార్టీలో చేరారు. మన ఏపీ ఎన్నికలలో విశాఖపట్టణం నియోజకవర్గం నుండి కుదిరితే పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికైనా లేకపోతే పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయడానికైనా రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అయితే టికెట్ విషయమై ఇంకా చర్చలు జరుగుతున్న క్రమంలో సరైన స్పష్టమైన సమాచారం బయటకు రాలేదు. అయితే మరోపక్క వైసిపి పార్టీ లోకి దగ్గుబాటి కుటుంబం వెళ్లడం నిజంగా జగన్ కి ప్లస్ అని ఇది tdp అధినేత చంద్రబాబు కి కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టే విషయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.