Advertisement

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ మైలేజ్ కోసం అన్న నాగబాబు కొత్త ప్రయత్నాలు..!

by Xappie Desk | January 27, 2019 16:25 IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ మైలేజ్ కోసం అన్న నాగబాబు కొత్త ప్రయత్నాలు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో అతి తక్కువ కాలంలోనే ఆయన స్థాపించిన పార్టీని మరియు పార్టీ సిద్ధాంతాలను సామాన్య జనం లోకి బలంగా తీసుకెళ్లారు. కేవలం వన్ మేన్ ఆర్మీగా ముందు నుండి పార్టీని పటిష్టంగా యువత నుండి బలంగా నాటుతూ దేశ మరియు రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అనేక ప్రజా సమస్యలపై పోరాడుతున్న పవన్ కళ్యాణ్ కోసం అన్న నాగబాబు త్వరలో పార్టీ లోకి రాబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల సోషల్ మీడియాలో తన వంతుగా కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టారు నాగబాబు.
 
ఇంతకి విషయం ఏమిటంటే ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు బామ్మర్ది నందమూరి బాలకృష్ణ పై సోషల్ మీడియాలో పరోక్షంగా వ్యాఖ్యలు చేసి అటు సినిమా రంగంలోని ఇటు రాజకీయ రంగంలో సంచలనం సృష్టించి అనేక వివాదాలు ఎదుర్కొనడం తో ఆ వివాదానికి స్వస్తి చెప్పారు నాగబాబు. తర్వాత చంద్రబాబు తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై గురి పెట్టారు, తాజాగా వైసీపీ అధినేత జగన్ పై కూడా తన సెటైరికల్ వీడియోను విడుదల చేసాడు ప్రస్తుతం అది ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో నాగబాబు వీడియోలను మెగా అభిమానులు సమర్దిస్తుండగా, టీడీపీ, వైసీపీ శ్రేణులు మాత్రం మండి పడుతున్నారు. నాగబాబు అవగాహనా లేకుండా విమర్శలు చేస్తున్నారంటూ ఆయన పై మండి పడుతున్నారు. మొత్తం మీద తన తమ్ముడి స్థాపించిన పార్టీ మైలేజ్ కోసం సోషల్ మీడియాలో నానా తంటాలు పడుతున్నారు నాగబాబు.


Advertisement


Advertisement

Top