జగన్ కి కొత్త పేరు పెట్టిన నారా లోకేష్..!

By Xappie Desk, January 28, 2019 12:28 IST

జగన్ కి కొత్త పేరు పెట్టిన నారా లోకేష్..!

ఇటీవల తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన జ‌య హో బీసీ స‌భ‌లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ప్రతిపక్ష నేత జగన్ పై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ మరోపక్క రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్ పై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ ప్రసంగించారు లోకేష్. దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి పార్టీ విస్తరించాలని అనేక ఆలోచనలు చేసి కర్ణాటక ఎన్నికలలో దారుణంగా ఓడిపోయింది అది కేవలం ట్రైలర్ మాత్రమే రానున్న ఎన్నికల్లో ఏపీలో సినిమా చూపిస్తామని బిజెపి పార్టీ పై విమర్శలు చేశారు. రాబోయే ఏపీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలిచి అనేక ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని ఢిల్లీలో ప్రధాని పేరును చంద్రబాబే ప్రకటిస్తారని ఈ సందర్భంగా ధీమాగా తెలియజేశారు లోకేష్. అక్క‌డితో ఆగ‌ని చిన‌బాబు వైసీపీ నేత వైఎస్ జ‌గ‌న్ పైనా విరుచుకుప‌డ్డారు. ఏపీ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతూ వైసీపీ నాలుగు డ్రామాల‌కు తెర‌తీసింది. అందులో మొద‌టిది.. ఏపీకి ప్ర‌త్యేక హోదా పేరుతో ఎంపీల రాజీనామా డ్రామా.. రెండోది కోడిక‌త్తి డ్రామా..మూడ‌వ‌ది… ఆవు – అంబులెన్స్ డ్ర‌మా. స‌భ‌లోకి ఆవు వ‌చ్చినా.. అంబులెన్స్ వ‌చ్చినా అది చంద్ర‌బాబే పంపించార‌ని ఆరోపిస్తున్నారు. నాటుగ‌వ‌ది ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ డ్రామా.. ఆంధ్రుల‌కు ద్రోహం చేసిన కేసీఆర్‌తో క‌లిసి వెళుతున్నారు. లంక‌లో పుట్టిన వాళ్లంతా రాక్ష‌సులే..ఆంధ్రాలో పుట్టినోళ్లంతా అలాంటి వాళ్లే అని ఆంధ్రుల‌ను అవ‌మానించిన కేసీఆర్‌తో జ‌గ‌న్ దోస్తీ చేస్తున్నారు. ర‌హ‌స్యంగా మోదీతో దోస్తీ చేస్తున్నాడు. అత‌ని పేరు జ‌గ‌న్ కాదు జ‌గ‌న్‌మోదీరెడ్డి` అంటూ నారా లోకేష్ మండిప‌డ్డారు.


Tags :


Top