జయహో బీసీ సభలో వరాలు ప్రకటించిన చంద్రబాబు..!

Advertisement

by Xappie Desk | January 28, 2019 12:31 IST
Follow Xappie
జయహో బీసీ సభలో వరాలు ప్రకటించిన చంద్రబాబు..!

రాజమండ్రిలో ఇటీవల జరిగిన జయహో బీసీ సభలో పాల్గొన్న చంద్రబాబు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే బాగా జరుగుతుందని ఇప్పటికే నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో అనేక అద్భుతాలు చేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీసీ వర్గాల ప్రజల గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న బీసీ ప్రజలకు టిడిపి హయాంలో గత కొన్నాళ్ల నుండి సరైన న్యాయం జరుగుతుందని తెలిపారు చంద్రబాబు. సగానికి పైగా ఉన్నటువంటి కులాల వారికీ ప్రత్యేకమైన కార్పొరేషన్లను ఏర్పాటు చేపిస్తామని, అంతేకాకుండా రజక, నాయీబ్రాహ్మణ, సగర, కమ్మరి, కుమ్మరి, పూసల బలిజ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంతేకాక గౌడ, శెట్టి బలిజ, ఈడిగలకు కూడా ప్రత్యేకమైన కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. మరొక కార్పొరేషన్లను యాదవులకు, కురమలకు ప్రకటించాడు.. బీసీలకు మరో 65 రెసిడెన్షియల్‌ పాఠశాలు నెలకొల్పనున్నట్లు తెలిపారు. అగ్నికుల క్షత్రియులను ఎస్సీల్లో చేర్చేందుకు కమిషన్‌ వేశామని, నివేదిక రాగానే దిల్లీకి పంపుతామన్నారు. పారిశ్రామిక పార్కుల్లో బీసీలకు 20శాతం రిజరేషన్లు కల్పిస్తామని.. తద్వారా వెనుకబడిన వర్గాల వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తోడ్పాటు అందిస్తామన్నారు దొమ్మర, ఉప్పర వంటి కులాల పేర్లతో కించపరిచే చర్యలను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు.


Advertisement


Advertisement

Top