ప్రత్యర్థులకు మతిపోగొడుతున్న పవన్ కళ్యాణ్ ప్రసంగం..!

Written By Xappie Desk | Updated: January 28, 2019 12:34 IST
ప్రత్యర్థులకు మతిపోగొడుతున్న పవన్ కళ్యాణ్ ప్రసంగం..!

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటల దాడి పెంచారు. ముఖ్యంగా ఇటీవల తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలపై దాడులు జరుగుతున్న క్రమంలో తనదైన శైలిలో గుంటూరులో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రత్యర్థి పార్టీ నాయకులకు గుండాల కు వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇటీవల గుంటూరులో జనసేన శంఖారావం సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ప్రజల కోసం మంచి చేయాలని భావన కలిగి ఏదైనా మొదలుపెడితే కచ్చితంగా అది జరుగుతుందని రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడానికి సరైన కొత్త పోలీసులు తీసుకువస్తున్నట్లు ముఖ్యంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసే శక్తి తనకు ఉందని అలాగే ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తుల పై గౌరవం కూడా ఉందని చట్ట సభలను గౌరవిస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ముఖ్యంగా తన పార్టీలో ధనవంతులు లేరని.. కడుపు మండిన వారున్నారన్నారు. మీ ప్రేమాభిమానాలకు మించి నాకేం అవసరం లేదని జనసేనాని అన్నారు. ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయను పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అనిౌప్రజల కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చాను. జీవిత కాలమంతా సినిమాలు చేస్తూ బతకాలా అనిపించిందని జనసేనాని అన్నారు. అణగారిన వర్గాలకు, ఆడపడుచులకు అండగ నిలబడకపోతే జీవితం వ్యర్థమనిపించిందని, అందుకోసమే రాజకీయాల్లో ఖీలక మార్పులు తేవడానికి వచ్చాను అంటూ పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. దీంతో పవన్ కళ్యాణ్ ప్రసంగం నిన్న ప్రత్యర్థి పార్టీల నాయకులకు గుండెల్లో దడ పుట్టినట్లు రాబోయే ఎన్నికల్లో టిడిపి వైసిపి పార్టీల కంటే జనసేన పార్టీ సామాన్య ప్రజల్లో బలంగా నాటుకు పోయే అవకాశాలు ఉన్నట్లు సదరు నాయకులు కామెంట్లు చేస్తున్నారు.
Top