జనసేన పోటీ చేసే స్థానాలు..?

Written By Xappie Desk | Updated: January 28, 2019 12:36 IST
జనసేన పోటీ చేసే స్థానాలు..?

2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి చంద్రబాబు అధికారంలోకి రావడానికి గల కారణాలలో ఒక కారణమైన పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని 175 శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు 25 పార్లమెంటు స్థానాల్లో కూడా పోటీ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న క్రమంలో పార్టీ నిర్మాణం సరైన క్రమంలో లేని నేపథ్యంలో చాలా విషయాలను దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికల్లో కేవలం 100 స్థానాల్లో ని పోటీ చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న టాక్. ముఖ్యంగా కొన్ని స్థానాలలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఉన్న పరిస్థితుల్లో జనసేన పార్టీని పోటీకి పెట్టి ఆస్థానాలలో జనసేన పార్టీ జెండా ఎగురవేయాలి అని వ్యూహాలు పన్నుతున్నారు పవన్. ఈ తరహా స్థానాల్లో పోటీ చేయడం ద్వారా మెజారిటీ సీట్లను సాధించడంతో పాటుగా ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినా.. కింగ్ మేకర్ గా వ్యవహరించే అవకాశాలున్నాయని భావిస్తున్నారట. మరి ఈ స్థానాలు ఎక్కడున్నాయన్న విషయంపై ఇప్పటికే రంగంలోకి దిగిపోయిన పవన్.. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లోని దాదాపుగా అన్ని స్థానాలను తనకు అనుకూలమైన నియోజకవర్గాలుగా ఎంచుకున్నారట. ఇక రాజకీయంగా కీలకమైన జిల్లాలుగా ఉన్న కృష్ణా గుంటూరు జిల్లాల్లో పదేసీ సీట్ల చొప్పున పోటీ చేయాలని పవన్ భావిస్తున్నారట. మొత్తం మీద పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో చాలా పకడ్బందీ ప్లాన్ తో రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.
Top