ప్రియాంక గాంధీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బిజెపి నేత సుబ్రమణ్య స్వామి…!

Written By Xappie Desk | Updated: January 28, 2019 12:40 IST
ప్రియాంక గాంధీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బిజెపి నేత సుబ్రమణ్య స్వామి…!

ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన చెల్లి ప్రియాంక గాంధీని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం జాతీయ రాజకీయాలలో పెద్ద సంచలనం అయింది. దీంతో ప్రియాంక గాంధీ పై బిజెపి పార్టీ నేతలు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రియాంక గాంధీని మెయిన్ టార్గెట్ చేశారు బీజేపీ నేతలు. ఈ నేపథ్యంలో ఇటీవల బిజెపి పార్టీకి చెందిన సుబ్రహ్మణ్యస్వామి మీడియాతో మాట్లాడుతూ ప్రియాంక గాంధీ రాజకీయాలకు ఫిట్ కాదని - ఆమె ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదని - మానసికంగా బ్యాలెన్స్ తప్పితే ప్రజలను కొట్టే ప్రమాదం ఉందని చెప్పారు. ``ప్రియాంకగాంధీకి బైపోలార్ డిజార్డర్ అనే మానసిక రోగం ఉంది. ప్రజా జీవితానికి పనికిరాదు. ఆమె దగ్గరగా ఉన్నప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి`` అన్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం ప్రియాంక రూపంలో ఎంతో ఆశిస్తోంది కానీ ఆ ఫలితాలు నెరవేరవని పేర్కొన్నారు. ఇదిలాఉండగా - కుంభమేళా సందర్భంగా వచ్చే నెల 4న గంగానది లో పవిత్ర స్నానం చేశాక బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం. ఇటీవలే క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించిన ప్రియాంక ఫిబ్రవరి 4న లక్నోలో తన సోదరుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొంటారని తెలుస్తున్నది. మొత్తంమీద ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీ పై జాతీయ రాజకీయాలలో అనేకమైన ఆసక్తి చర్చలు జరుగుతున్నాయి.
Top