పథకాలను ప్రకటించడానికి రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్..!

Written By Xappie Desk | Updated: January 29, 2019 11:49 IST
పథకాలను ప్రకటించడానికి రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త పంథాలో సరికొత్త రాజకీయ నాయకుడిగా ముఖ్యంగా యువతను ప్రభావితం చేసే విధంగా ప్రస్తుత రాజకీయాలలో తన పంతాల ప్రసంగాన్ని ప్రసంగిస్తూ మరోపక్క ప్రజాసమస్యలను లేవనెత్తుతూ అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని మరియు విపక్షంలో ఉన్న నాయకులను ఏకి పారేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు భారీ ఎత్తున ప్రకటనలకు ఖర్చు చేయకుండా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నేతలు ప్రచార రథాలను సిద్ధం చేశారు.
 
వాటిపై జనసేన సిద్ధాంతాలు, అధికారం అప్పగిస్తే చేపట్టబోయే పథకాల వివరాలను ముద్రించారు. ఇటీవల విజయవాడలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ ప్రచార రథాలను ప్రారంభించారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికలలో ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా కుదిరితే కేవలం వామపక్ష పార్టీలతో తప్ప వేరే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా పోటీ చేయడానికి అన్ని విధాలా తన పార్టీకి సంబంధించిన నాయకులను కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా ఇటీవల తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని మళ్ళీ 2014 ఎన్నికల మాదిరిగా పోటీ చేస్తారని కామెంట్లు చేస్తున్న క్రమంలో జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు రాబోయే ఎన్నికలలో కచ్చితంగా టీడీపీతో కానీ మరే ఇతర పార్టీలతో కానీ పొత్తు ఉండే ప్రసక్తి లేదని కేవలం వామపక్ష పార్టీలతో తప్ప వేరే పార్టీలతో కలిసి పనిచేసే అవకాశం లేదని తేల్చి పారేశారు.
Top