ముద్రగడ ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం...!

Written By Xappie Desk | Updated: January 29, 2019 11:59 IST
ముద్రగడ ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం...!

2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి అధికారం రావడానికి గల కారణాలలో హామీల లో ముఖ్య కారణం కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడం. అయితే తీరా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీల విషయంలో మాట తప్పడం తో మాజీ మంత్రి కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం చంద్రబాబుపై తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. దీంతో చంద్రబాబు ముద్రగడ పద్మనాభం చేస్తున్న పోరాటాన్ని పోలీసుల చేత అణచివేయడంతో గత కొంతకాలంగా ముద్రగడ పద్మనాభం సైలెంట్ అయిపోయారు. అయితే ప్రస్తుతం ఎన్నికలు వస్తున్న తరుణంలో ముద్రగడ పద్మనాభం ఈనెల 31వ తేదీన చలో కత్తిపూడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
 
దీంతో వెంటనే అలర్ట్ అయిన చంద్రబాబు ప్రభుత్వం చలో కత్తిపూడి పిలుపుమేరకు నిర్వహించే సమావేశానికి మూడు రోజులు ముందుగానే మళ్లీ కిర్లంపూడిలో ఇప్పటికే వందలాది మంది పోలీసులు కిర్లంపూడిలో పహారా ఏర్పాటు చేశారు. ముద్రగడ నివాసం బయట ఇప్పటికే ఎదురుగా ఉన్న స్తంభాలకు 3 కెమెరాలతో ముద్రగడ నివాసంలోకి వెళ్లి వచ్చేవారిని పోలీసులు విచారించే పనిలో ఉన్నారు. ఐతే మరొక సారి చంద్రబాబు ప్రభుత్వం కాపులపై క్షక్షగట్టి పనిలో ఉందని కనీసం మా జాతికి ఇచ్చిన రిజర్వేషన్లు చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయకపోవడంతో భవిష్యత్‌ కార్యాచరణపై కాపులతో ముద్రగడ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ముద్రగడ తన భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తారని కాపు జాతి, కార్యకర్తలు, అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ముద్రగడ ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోపక్క కాపు జాతి కి సంబంధించిన ప్రముఖులు ఈ సారి ఉద్యమాన్ని ఉధృతం చేయడం ఖాయమని మరోసారి మోసపోమని కామెంట్ చేస్తున్నారు.
Top