చంద్రబాబు ని టార్గెట్ చేసిన నాగబాబు..!

Written By Xappie Desk | Updated: January 29, 2019 12:12 IST
చంద్రబాబు ని టార్గెట్ చేసిన నాగబాబు..!

గత కొంత కాలంగా సోషల్ మీడియాలో పరోక్షంగా బాలకృష్ణపై మరియు నారా లోకేష్ పై వైసిపి అధినేత జగన్ పై కామెంట్లో చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్న మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ఇటీవల టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ని టార్గెట్ చేశారు. ముఖ్యంగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీకి మేలు చేకూర్చే విధంగా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ వ్యంగ్యంగా జనసేన పార్టీకి వ్యతిరేకంగా ఉన్న నాయకులపై తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒక వీడియో చేశారు.
 
ఈ వీడియోలో మాత్రం చంద్రబాబుకి గట్టి స్ట్రోకే ఇచ్చారని చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో అయినా సరే అవినీతిలో అయినా సరే నెంబర్ 1 లో ఉందంటూ చంద్రబాబు అసెంబ్లీలో గట్టిగా చెప్తున్నట్టు ఈ వీడియో సారాంశం. దీనితో నాగబాబుకి మంచి ఆయుధంలా దొరికింది. దీనితో ఇందులో ఒక నిజం ఒక అబద్ధం ఉన్నాయి అవేంటో కనుక్కోండి అంటూ మరో సెటైర్ వేసారు. మరి అందరి తప్పులను ఎత్తి చూపిస్తున్న నాగబాబు అతని తమ్ముడు పవన్ కూడా రాజకీయాల్లో ఉన్నారు అయన తప్పులపై కూడా ఇలాంటి వీడియోలను చేస్తారో లేదో చూడాలి అని సోషల్ మీడియాలో కొంత మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Top