ఆ జిల్లాల నే నమ్ముకున్న పవన్ కళ్యాణ్..?

Written By Xappie Desk | Updated: January 29, 2019 12:14 IST
ఆ జిల్లాల నే నమ్ముకున్న పవన్ కళ్యాణ్..?

2014 ఎన్నికలలో టిడిపికి మద్దతు తెలిపి రెండు గోదావరి జిల్లాలలో అప్పటి వరకు వైసిపి పార్టీ వైపు ఉన్న గాలిని ఒక్కసారిగా తన రాజకీయ ఎంట్రీ తో పూర్తిగా ఆంధ్ర రాజకీయ లెక్కలను మార్చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే ప్రస్తుతం 2019 ఎన్నికలలో తాజా రాజకీయ పరిస్థితుల బట్టి ఒంటరిగా పోటీ లోకి దిగుతున్న పవన్ కళ్యాణ్ 175 స్థానాల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు.
 
ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో కొంతవరకే పార్టీని పటిష్టం చూసుకుని ఉన్న పవన్ కళ్యాణ్ అన్ని స్థానాల్లోనూ పోటీ చేసేంత కేపాసిటీ పవన్ కల్యాణ్ పార్టీకి లేదనేది ఓపెన్ సీక్రెట్‌. జ‌న‌సేన త‌ర‌పున ఎవరైనా నామినేష‌న్ వేసినావారి ఖ‌ర్చులు ప‌వ‌నే భ‌రించాల్సి వ‌స్తుంది. అందుకే ప‌వ‌న్ పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ని సమాచారం. అందుకే ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల మీదే పవన్ కల్యాణ్ దృష్టి పెట్టాడని స్పష్టం అవుతోంది. గోదావరి జిల్లాల్లో త‌న సామాజిక వ‌ర్గ‌ ఓట్ల మీద పవన్‌కు చాలా ఆశలున్నాయి. కాపుల మీద ఆధారపడి రాజకీయం చేయడం లేదని పవన్ కల్యాణ్ చెబుతున్నా... ఆయ‌న ఆ ప్రాంతాల‌పైనే ఎక్క‌వ‌గా కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. కాపులు-బలిజల జనాభా గట్టిగా ఉన్న చోట మాత్రమే.. జ‌న‌సేన‌ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Top