జాతీయ సర్వేలలో దూసుకెళ్ళిపోతున్న జగన్ పార్టీ..!

Written By Xappie Desk | Updated: January 31, 2019 10:36 IST
జాతీయ సర్వేలలో దూసుకెళ్ళిపోతున్న జగన్ పార్టీ..!

మరి కొద్ది రోజులలో త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో టైమ్స్ నౌ జాతీయ సర్వేలో వైసీపీ పార్టీకి స్పష్టమైన మెజార్టీ స్థానాలు రావడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశమయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కి ఈ సర్వే ఫలితాలు చూసి షాక్ తిన్నట్లు అయింది. మొత్తంమీద సర్వేల ఫలితాలు బట్టి చూస్తుంటే తెలుగుదేశం పార్టీని నమ్మే పరిస్థితుల్లో ఆంధ్ర ప్రజలు లేరని అర్థమైపోతుంది. ఈ సర్వేలో పార్లమెంట్ స్థానాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 స్థానాలు వైసీపీ పార్టీ కైవసం చేసుకుంటుందని రెండు స్థానాలు అధికార పార్టీ టిడిపికి దక్కుతాయని ఫలితాలలో వెలువడింది.
 
ముఖ్యంగా త్రిముఖ పోటీ అని అందరూ అనుకున్న కానీ జనసేన పార్టీ ఈ సర్వేలో అడ్రస్ లేకుండా పోయింది. అంతేకాకుండా 2014 ఎన్నికల్లో బీజేపీకి సాధారణ మెజారిటీ దక్కగా, ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో బీజేపీ కూటమి (ఎన్డీయే)కు సాధారణ మెజారిటీ దక్కబోదని, ప్రాంతీయ పార్టీలు కీలకం కానున్నాయని ఈ సర్వే అంచనా వేసింది. 545 మంది సభ్యులున్న లోక్ సభలో ఎన్డీయేకు 252 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 147 సీట్లు, ఏ కూటమికి చెందని ఇతరులకు 144 సీట్లు వస్తాయని, ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకమని పేర్కొంది. మొత్తం మీద కేంద్ర రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రాంతీయ పార్టీల అవసరం ఉన్న నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ స్పష్టమైన ఆధిక్యత కొనసాగిస్తున్న క్రమంలో రాబోయే రోజుల్లో ఏపీ... జాతీయ రాజకీయాలలో కీలకం కానుందని పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Top