తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారి నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్లు కామెంట్లు చేసి రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన కేసీఆర్ గతంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలో శారదాపీఠాన్ని దర్శించారు. అయితే తాజాగా మరోసారి కెసిఆర్ విశాఖపట్టణం రానున్నట్లు ఫిబ్రవరి 14న పర్యటన ఖరారైనట్లు శారదా పీఠం దర్శించిన ఉన్నట్లు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు శారదా పీఠం లో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాజకీయాల నుండి వస్తున్న సమాచారం. ఇటీవల ఎర్రవెల్లిలో చండీయాగం, మహారుద్రయాగం, రాజశ్యామలాదేవి వంటి మహాయాగాలు సంపూర్ణంగా పూర్తి చేసిన ఆయన మళ్లీ విశాఖ శారదా పీఠాన్ని మళ్లీ సందర్శిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రాజశ్యామలా దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడే కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ భోజనం చేయనున్నారు. అనంతరం నేరుగా ఏపీ రాజధాని నగరంగా ముస్తాబవుతున్న అమరావతికి చేరుకోనున్నారు. అక్కడ ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగమ్మోహన్‌రెడ్డి నూతన గృహ ప్రవేశానికి హాజరుకానున్నారు. అయితే వైఎస్ జగమ్మోహన్‌రెడ్డి నూతన గృహ ప్రవేశానికి హాజరు కాబోతున్నారన్నషెడ్యూల్ ని అధికారికంగా ఇది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మొత్తం మీద కెసిఆర్ మళ్లీ ఏపీ పర్యటన చేస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలలో కేసీఆర్ పర్యటన పెద్ద హాట్ టాపిక్ అయింది.