రాష్ట్రంలో జరుగుతున్న సర్వేల పై సీరియస్ అయిన నారా లోకేష్..!

Written By Xappie Desk | Updated: January 31, 2019 10:44 IST
రాష్ట్రంలో జరుగుతున్న సర్వేల పై సీరియస్ అయిన నారా లోకేష్..!

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సర్వేల మొదలయ్యింది. ఈ సందర్భంగా జరుగుతున్న సర్వేలలో వైసిపి పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తున్న నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ సంచలన కామెంట్లు చేశారు. త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చటానికి సొంత సర్వేలు చేయించుకుంటున్నారని వాటితో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని కామెంట్లు చేశారు. 2014 ఎన్నికలలో కూడా ఇదే విధంగా ప్రచారం చేశారని కానీ చివరాకరికి టీడీపీకి అధికారం ప్రజలు కట్టబెట్టారని గుర్తు చేశారు. ముఖ్యంగా ఇటీవల జగన్ ప్రకటించిన హామీలను టిడిపి కాపీ కొడుతున్నట్లు ప్రతిపక్ష పార్టీకు చెందిన నాయకులు చేసిన కామెంట్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు లోకేష్. వైసీపీ పథకాలను కాపీ కొట్టాల్సిన అవసరం టీడీపీకి లేదని, మాకు ప్రజల అభిమానం అండగా ఉన్నదని లోకేష్ అన్నారు.
 
ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసిన కూడా ప్రజల అండదండలే మాకు అధికారాన్ని ఇస్తాయి అని నారా లోకేష్ అన్నారు. అంతేకాకుండా రాష్ట్రాభివృద్ధి కోసం పాలసీ ప్రకారమే భూముల కేటాయింపులు జరుగుతాయని, రూ.5 కోట్లకు ఎకరం ఇస్తే పెట్టుబడి పెట్టేందుకు ఎవరు ముందుకొస్తారని లోకేశ్ ప్రశ్నించారు. కాగా కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రి తోమర్‌ను కలిసిన లోకేశ్… ఉపాధి హామీ బకాయిలు విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. ఇంకా మెటీరియల్, వేతనాల కింద కేంద్రం రూ.2138 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. 346 కరువు మండలాల్లో 150 రోజుల పనిదినాలకు కేంద్రం అనుమతించాలని తోమర్‌ను కోరినట్లు లోకేశ్ స్పష్టం చేశారు.Top