త్వరలో అమరావతిలో కొలువుదీరనున్న వెంకన్న స్వామి ఆలయం..!

Written By Xappie Desk | Updated: January 31, 2019 12:04 IST
త్వరలో అమరావతిలో కొలువుదీరనున్న వెంకన్న స్వామి ఆలయం..!

ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా చంద్రబాబు అమరావతి ప్రాంతంలో తుళ్లూరు మండలం వెంకటపాలెంలో కలియుగ దైవం శ్రీవారి ఆలయ నిర్మాణానికి మొదటి ఆడుగు పడింది. సిఎం చేతుల మీదాగా ఆగమోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించారు.
 
ఆలయ నిర్మాణానికి సంబంధించి భూకర్షణం, బీజావాపనం కోసం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. గర్భగుడి ప్రాంతంలో సీఎం నాగలితో భూమి దున్ని నవధన్యాలు చల్లారు. తితిదే వేదపండితులు శాస్త్రోక్తంగా గోపూజ, కలశ పూజ నిర్వహించారు. తిరుమల పెద్దజీయంగార్‌ స్వామి ఆధ్వర్యంలో కైంకర్యాలు జరిగాయి. భూకర్షణ ప్రాంతంలో గోవు, కలశంతో ప్రదక్షిణ చేశారు. అయితే రూ.150 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. దీని కోసం ప్రభుత్వం సేకరించిన 25 ఎకరాల స్థలాన్ని తితిదే తన ఆధీనంలోకి తీసుకుంది. ఫిబ్రవరి 10న ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించనున్నారు.
Top