ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అయినా లగడపాటి..!

By Xappie Desk, January 31, 2019 12:08 IST

ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అయినా లగడపాటి..!

లగడపాటి పెద్ద హాట్ టాపిక్ ఆయ్యారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలల్లో లగడపాటి చేసిన సర్వే ఫలితాలు రాకముందు పెద్ద చర్చనీయాంశమైంది. తీరా ఫలితాలు వచ్చాక మొత్తం తారుమారు అయింది. ఈ నేపధ్యం లో త్వరల్లో ఏపీలో ఎలక్షన్స్ వస్తున్న క్రమంలో లగడపాటి ఏపీ సీఎం చంద్రబాబు తో భేటీ కావడం ఇప్పుడు తెలుగు రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో లగడపాటి సంచలన కామెంట్లు చేశారు. త్వరలో దేశంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఏ రాష్ట్రానికి సంబందించిన ఫలితాలను తాను ఎన్నికలకు ముందు అయితే వెల్లడి చెయ్యను అని సంచలనం సృష్టించారు.
 
ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రమే తన సర్వేలో వచ్చిన ఫలితాలను చెప్తానని ఖరాఖండిగా చెప్పేసారు. అప్పటి వరకు జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు గాని అసెంబ్లీ ఎన్నికలకు గాని ఫలితాలు ముందే చెప్పను అని అందరికి తెలియజేస్తున్నా అని ప్రకటించేసారు. ఆ ఎన్నికలు అయిన తర్వాత తాను ఒక ప్రెస్ మీట్ పెట్టి తన సర్వేలలో వచ్చే ఫలితాలు, తెలంగాణలో తెరాస ఎందుకు గెలిచిందో దానికి గల కారణాలు తెలుపుతానని తేల్చి చెప్పేసారు. మొత్తంమీద లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ అయ్యారు.Top