సరికొత్త ప్లాన్ లతో మరింత దూసుకెళ్ళిపోతున్న జగన్..!

Written By Xappie Desk | Updated: February 01, 2019 14:25 IST
సరికొత్త ప్లాన్ లతో మరింత దూసుకెళ్ళిపోతున్న జగన్..!

ప్రజా సంకల్ప పాదయాత్ర తో ఆంధ్రరాష్ట్రం లో వైసీపీ పార్టీ గ్రాఫ్ అమాంతం గా పని చేసిన జగన్ ప్రస్తుతం రాష్ట్రంలో మరియు జాతీయ మీడియాలో జరుగుతున్న సర్వేలలో తానే ముఖ్యమంత్రి అవుతారని ఫలితాలు వచ్చేలాగా తన పార్టీ గ్రాఫ్ ను ముందుకు తీసుకెళ్లిపోతూ పార్టీ పై ప్రజలకు నమ్మకం కలిగిస్తూ పార్టీ క్యాడర్ను మరింత ఉత్సాహ పరుస్తున్నారు జగన్. ఇదిలా ఉండగా తాజాగా అన్న పిలుస్తున్నాడు అనే కార్యక్రమంతో మరింత దగ్గర అయ్యారు మేధావులతో. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న మేధావుల దగ్గరనుండి సలహాలు సూచనలు స్వయంగా జగన్ తీసుకున్నారు.
 
ఈ సందర్భంగా సమావేశంలో జగన్ మాట్లాడుతూ పాదయాత్రలో తను ప్రకటించిన హామీలను ఎంతవరకు కాపీ కొడతారో చూద్దామని వ్యాఖ్యలు చేశారు. ఓ స్టూడెంట్‌ బాగా చదువుతాడు. కష్టపడి చదివి టెన్త్‌క్లాస్‌ పరీక్షలకు హాజరవుతాడు. చాలా కష్టపడి చదివాడు కాబట్టి బాగా రాస్తాడు. ఇంకో పిల్లాడు పక్కనే ఉంటాడు. అసలు చదవడు. మోసం చేస్తా ఉంటాడు, అబద్ధాలాడుతూ ఉంటాడు. పక్కన కాపీకొట్టి రాస్తాడు. కానీ చివరకు వచ్చేసరికి ఎంత కాపీ కొడతాడు...? కాబట్టి కాపీ కొట్టే వారికి మార్కులు రావు. మీలాంటి యువతీ యువకులను బాగుపరచాలి అంటే ఈ వ్యవస్థలో సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ చాలా ముఖ్యమైనది.
 
ఒకవైపు ఉద్యోగాలు సృష్టిస్తూ మరోవైపు సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ కల్పించేందుకు ఎంటర్‌ప్రెన్యూర్‌లను సపోర్ట్‌ చేయాలి. దీంతో నేను ఏకీభవిస్తా. నా మనసులో కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఎలా ఉందీ అంటే..ఉదాహరణకు ఆర్టీసీనే తీసుకోండి.. పేరుకే ఆర్టీసీ బస్సులు. మంచిరూట్లన్నీ ప్రైవేటుకు ఇస్తారు. దివాకర్‌ ట్రావెల్స్‌ అంటారు (దివాకర్‌రెడ్డి), కేశినేని నాని అంటారు...ఏదన్నా తీసుకోండి అంతా కాంట్రాక్టే. కాంట్రాక్టుకు ఇవ్వడం, డబ్బులు సంపాదించుకోవడం, బినామీలుగా వీళ్లే పంచుకోవడం. ఎంత దారుణం? అని జగన్ వ్యాఖ్యానించారు.
Top