ఎమ్మెల్యేల పై సీరియస్ అయినా చంద్రబాబు..?

By Xappie Desk, February 01, 2019 14:27 IST

ఎమ్మెల్యేల పై సీరియస్ అయినా చంద్రబాబు..?

ఎన్నికలు దగ్గర కొస్తున్న నేపథ్యంలో అటు ప్రజలతోనూ ఇటు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటు రాబోయే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా నాయకులు ఉండేల నియోజకవర్గాలలో సర్వేలు చేస్తూ ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో కలకలం సృష్టించినట్లు సమాచారం.
 
ముఖ్యంగా ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో బాధ్యతగా వ్యవహరించకుండా ఉంటున్నారని చంద్రబాబు ఈ సమావేశంలో సీరియస్ అయినట్లు టాక్. అంతేకాకుండా ఎమ్మెల్యేలు తాను చేసిన సూచనలను సరిగా పాటించలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారని కదనం. నేను అనేక అంశాలపై ఎమ్మెల్యేలకు సూచనలు ఇస్తున్నా. కానీ ఆ స్ధాయిలో ప్రతిస్పందించడంలో మీరు విఫలమవుతున్నారు. ఫలితం లేకపోతే తర్వాత నేనేమీ చేయలేను. ఆపై మీ ఇష్టం. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.' అన్నారని పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం.


Tags :


Top