వ్యవసాయ రంగం పై సంచలన కామెంట్స్ చేసిన చంద్రబాబు..!

By Xappie Desk, February 01, 2019 14:38 IST

వ్యవసాయ రంగం పై సంచలన కామెంట్స్ చేసిన చంద్రబాబు..!

ఇటీవల తన పార్టీ ప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న రైతాంగం గురించి మరియు వ్యవసాయ రంగం గురించి సంచలన కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగం చాలా సంతోష దాయకం గా ఉందని సకాలంలో వర్షాలు పడటం వల్ల వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందని రైతు రెండింతలుగా మేలు పొందాడని టిడిపి ప్రభుత్వం వల్ల వ్యవసాయ రంగానికి చాలా అభివృద్ధి జరిగిందని ఈ సమావేశంలో చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం.
 
అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఏ విధమైన మేలు చేసిందో ప్రతి ఒక్కరు తమ తమ నియోజకవర్గాలలో రైతులకు అర్థమయ్యేలా వివరించాలని చంద్రబాబు సూచనలు ఇచ్చారు. ఆటోలపై పన్ను రద్దు చేశాం. ట్రాక్టర్లపై పన్ను మినహాయింపు ఇచ్చాం. ఇప్పటికే పింఛన్లు పది రెట్లు చేశాం. రూ.2 వేలు, 3 వేలు, రూ.3,500 ఇస్తున్నాం. పసుపు-కుంకుమ రెండు దశలుగా ఇస్తున్నాం. వాళ్లందరి ఆదరణ పొందాలి. రైతుల రాబడిని రెట్టింపు చేశాం. 17 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశాం. మరో 6 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. 22 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. వీటన్నిటినీ శాసనసభ వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని పార్టీ ప్రతినిధులకు చంద్రబాబు సూచించారు.Top