మాటమీద నిలబడిన పవన్ కళ్యాణ్..!

Written By Xappie Desk | Updated: February 02, 2019 11:09 IST
మాటమీద నిలబడిన పవన్ కళ్యాణ్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుత రాజకీయ నాయకులలో ఏ స్వార్ధం గా మరియు సూటిగా స్పష్టంగా తాను ఏ విధమైన రాజకీయాలు చేయాలనుకుంటున్నారు అన్న విషయాన్ని ప్రజలకు మరియు పార్టీ కార్యకర్తలకు పార్టీలోకి రావాలని చూస్తున్న నాయకులకు సుత్తిలేకుండా సూటిగా స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో ప్రజాపోరాట యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలలో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా తాను చెప్పిన మాటకు కట్టుబడే విధంగా పార్టీ తరఫున నియమించిన కమిటీ లో ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు. సమకాలీన రాజకీయ పార్టీల కమిటీ నిర్మాణాలకు భిన్నంగా, భవిష్యత్తు భారతావని అవసరాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కమిటీలకు జనసేనాని రూపకల్పన చేశారు. అంతేకాకుండా మన దేశ రాజకీయాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో జవాబుదారీతనాన్ని తీసుకొస్తానని హామీ ఇస్తున్నారు. అందుకోసమనే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు. అందుకోశామనే మహిళాశక్తికి రాజకీయ సాధికారిత అందించాలన్న ఆలోచన తో నే మహిళలకు అవకాశం ఇస్తున్నారు జనసేనాని. మొత్తం మీద పవన్ కళ్యాణ్ తాను ఏ విధమైన మాటలు ప్రజలకు చెప్పారో ఆ విధంగా నడుచుకుంటూ ప్రజలకు తనపై నమ్మకాన్ని కనబరుస్తున్నారు.
Top