సంచలన కామెంట్లతో బిజెపి ఎమ్మెల్సీలకు చుక్కలు చూపించిన లోకేష్..!

Written By Xappie Desk | Updated: February 02, 2019 11:14 IST
సంచలన కామెంట్లతో బిజెపి ఎమ్మెల్సీలకు చుక్కలు చూపించిన లోకేష్..!

త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న బిజెపి నేతలు అధికార పార్టీ టీడీపీ ని ఇటీవల దారుణంగా విమర్శలు చేశారు. దీంతో బీజేపీ చేసిన కామెంట్లపై ఏపీ మంత్రి నారా లోకేష్ పంపించారు. ముఖ్యంగా అసెంబ్లీలో ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన హామీల అమలు పరచాలని ప్రభుత్వం తీర్మానం చేసిన ప్రతులను బీజేపీ ఎమ్మెల్సీ లు చించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. న్యాయపరంగా రాష్ట్రానికి రావాల్సిన విషయంలో ఏపీ ప్రభుత్వం తీర్మానం చేస్తే కేంద్రం అండదండలు తీసుకుని అధికారంలో ఉన్నామని విర్రవీగుతూ ఆ కాపీలను బీజేపీ ఎమ్మెల్సీలు చించేస్తారా అని ప్రశ్నించారు. వీరిది చాలా నీచపు చర్య… ఆలా చేయడానికి కనీసం కొంచం కూడా ఆలోచించారా అని ప్రశ్నించారు లోకేష్. వారు అసలు ఏపీ లో నే ఉంటున్నారా లేక ఇంకెక్కడైనా ఉంటున్నారా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏపీ, తెలంగాణను చీల్చినట్లు కాపీలను చించేశారని వ్యాఖ్యానించారు. వారు కావాలనే వారి పార్టీని సమర్థిస్తూ వస్తున్నారు. నిధులు ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించినందుకు ఇలాంటి నీచపు చర్యలకు పాల్పడ్డారని లోకేష్ ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఏపీ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని బిజెపి ఎమ్మెల్సీలపై తిరగబడ్డారు లోకేష్.
Top