త్వరలో ఢిల్లీ లో మనమే చక్రం తిప్పేది మనమే అంటున్న జగన్..!

By Xappie Desk, February 02, 2019 11:19 IST

త్వరలో ఢిల్లీ లో మనమే చక్రం తిప్పేది మనమే అంటున్న జగన్..!

ప్రజా సంకల్ప పాదయాత్ర తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక జాతీయ రాజకీయాల్లో కూడా కీలకం కాబోతుంది వైసీపీ పార్టీ అని ఇటీవల రాష్ట్రంలో మరియు జాతీయస్థాయిలో జరిగిన సర్వేలలో స్పష్టమైన ఫలితాలు రావడంతో వైసిపి పార్టీ అధినేత మరియు పార్టీ క్యాడర్ మంచి జోష్ లో ఉంది. గత ఎన్నికలలో కొద్దిపాటి తేడాతో అధికారాన్ని కోల్పోయిన జగన్ ఈసారి కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గెలవడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల పాదయాత్ర ముగించుకున్న జగన్ అన్న పిలుస్తున్నాడు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. లోటస్ పాండ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న మేధావులు మరియు మరి కొంత మంది ప్రముఖులు హాజరయ్యారు. అన్న పిలుస్తున్నాడు కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరి దగ్గర నుండి సలహాలు సూచనలు జగన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ ఈ సమావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో నేషనల్ పిక్చర్ గమనిస్తే కచ్చితంగా హంగ్ ఏర్పడే అవకాశముందని..అది మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమని మనం కనుక రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు స్థానాలు ఎక్కువగా కైవసం చేసుకుంటే ఢిల్లీలో కేంద్రంలో ఏ పార్టీ కూర్చోవాలో నిర్ణయించేది మనమేనని ధీమా వ్యక్తం చేశారు జగన్. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ మెజారిటీ సంపాదించలేవని తేల్చేసిన ఆయన హాంగ్ ఏర్పడుతుందని అప్పుడు ఎవరైనా సరే తమ వద్దకే రావాలని అన్నారు. అందుకుగాను రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు గెలిచి పెట్టుకోవాలని, అప్పుడే తమ మాట నెగ్గుతుందని, ఢిల్లీ పార్టీలు తమ ముందు మోకరిల్లుతాయని అప్పుడు మనం అడగకుండానే విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రతి హామీ మనం నెరవేర్చుకోవచ్చు అని వ్యాఖ్యానించారు జగన్.Top