కేసిఆర్ ని భవిష్యత్తు ప్రధానిగా చూస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్..?

By Xappie Desk, February 02, 2019 11:31 IST

కేసిఆర్ ని భవిష్యత్తు ప్రధానిగా చూస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్..?

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ మరియు ఎంఐఎం పార్టీలు మిత్రపక్ష పార్టీలని వాటిని విడదీసే ధైర్యం ఏ రాజకీయ పార్టీలకు లేవని చాలాసార్లు ఇరు పార్టీలకు చెందిన నేతలు మీడియా ముందు వాపోయారు. ముఖ్యంగా ఓటుకు నోటు కేసు సమయంలో అప్పుడే తెలంగాణ ప్రజల చేత ఏర్పడిన మొదటి ప్రభుత్వాన్ని కొన్ని రాజకీయ దృష్టశక్తులు కూలదోయాలని చూసిన క్రమంలో ఎంఐఎం పార్టీ మొట్టమొదటిసారిగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వాన్ని కాపాడిందని పేర్కొన్నారు టిఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో రాణించాలని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఇటీవల దేశంలో ఉన్న కొంతమంది ముఖ్యమంత్రులను కలిసిన కెసిఆర్ పై ఎంఐఎం పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో కిసాన్‌ సమ్మాన్‌ నిధిని ప్రకటించారు. దానికి ప్రతిస్పందించిన ఎంఐఎం ఎంపి అసదుద్దీన్‌ ఓవైసి తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. వ్యవసాయ సమస్యలపై కేసిఆర్‌కు ఉన్న లోతైన అవగాహన మరే నేతకు లేవన్నది ఆయన ట్వీట్‌లో స్పష్టంగా అర్దమవుతుంది. తెలంగాణ చేపట్టిన పథకాలనే ప్రధాని అమలు చేస్తున్నారని, ప్రధాని మోదికి సొంత ఐడియాలు లేవని ఆయన అన్నారు. దేశాన్ని ముందుకు నడిపించేందుకు కేసిఆర్‌ లాంటి నేతలు అవసరమన్నారు. దేశానికి దిశా నిర్ధేశం చేసే సత్తా ఒక్క కేసిఆర్‌కే ఉందని, ఆయన చురుకుదనం, ముందుచూపు, అమోఘమైన జ్ఞానం దేశంలోని రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతుందని అసద్‌ అన్నారు. మొత్తం మీద అసదుద్దీన్ భారత భవిష్యత్తు ప్రధానిగా కేసీఆర్ ని చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.


Tags :


Top