ఏపీ కాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చినా ఆ లీడర్..!

Written By Xappie Desk | Updated: February 03, 2019 15:40 IST
ఏపీ కాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చినా ఆ లీడర్..!

ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా నడుస్తున్నాయి. పార్టీలు మార్చే లీడర్ల లక్ష్యమేమిటో అంతుచిక్కడంలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి బయటికొస్తున్నవారు టీడీపీలోకి వెళ్తూ ఆశ్చర్యం కలిగిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే కర్నూలు జిల కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్దమవగా ఇప్పుడు మరొక ముఖ్య నేత కిశోర్ చంద్రదేవ్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కాంగ్రెస్ పార్టీని నేలమట్టం చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని, అందుకే 45 ఏళ్ల అనుబంధాన్ని పక్కనబెట్టి పార్టీని వీడాల్సి వస్తొందని, ఇది తనకు ఎంతో బాధ కలిగిస్తోందని అన్నారు.
 
అయితే చంద్రదేవ్ ఏ పార్టీలో చేరతారనేది చెప్పలేదు. ఐదుసార్లు అరకు నుండి ఎమెమ్మెల్యేగా గెలుపొందిన కిశోర్ చంద్రదేవ్ కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.రాజకీయ వర్గాలు మాత్రం ఆయన టీడీపీలోకి వెళతారని, అంతటి సీనియర్ నాయకుడికి చంద్రబాబు మంచి ప్రాధాన్యమే ఇస్తారని అంటున్నారు. ఇలా సీనియర్ లీడర్లు బయటికి వెళ్లిపోతున్నా కాంగ్రెస్ పెద్దలు మాత్రం నోరు మెదపడంలేదు. ఈ వ్యవహారం చూస్తుంటే కాంగ్రెస్, టీడీపీల మధ్య ఏదో ఒప్పందం నడుస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయి. గెలిచే సత్తా ఉన్న నేతలకు తమ పార్టీపై ఉన్న నెగెటివ్ అభిప్రాయం అడ్డంకి కాకూడదని భావించిన కాంగ్రెస్ అధిష్టానం వారిని టీడీపీలోకి వెళ్లేందుకు అనుమతిస్తోందని, అందుకు టీడీపీ కూడా ఒప్పుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Top