పవన్ పై ఎవరు ఊహించని కామెంట్లు చేసినా లగడపాటి..!

Written By Xappie Desk | Updated: February 03, 2019 15:42 IST
పవన్ పై ఎవరు ఊహించని కామెంట్లు చేసినా లగడపాటి..!

ఏపీ మరియు తెలంగాణా ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు లగడపాటి సర్వేలు అంటే ఒక బ్రాండ్ ఉండేది. కానీ గడిచిన తెలంగాణా ఎన్నికల్లో ఆయన సర్వే లెక్కలన్నీ తారుమారయ్యే సరికి ఆయన సర్వేలపై ప్రతీ ఒక్కరికీ నమ్మకం సన్నగిల్లింది. ఆ తర్వాత ఆయన సర్వేలను ఇక నుంచి ఎన్నికలకు ముందు గానే చెప్పేది లేదు అని ఎన్నికలు ముగిసిన తర్వాత తన లెక్కలు చెప్తా అన్నారు.
 
అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో రాజకీయ పరిపక్వత ఉన్నవారు ఎవరు అని ఇంటర్వ్యూల స్పెషలిస్ట్ నాగరాజు గారు అడగగా లగడపాటి పవన్ పై కొన్ని సంచలన కామెంట్స్ చేసారు. పవన్ కళ్యాణ్ విషయంలో ఎవరు గమనించలేని విషయం తాను చెప్తానని తన సినిమా కెరీర్ ని పక్కన పెట్టి,ఎదో డబ్బులు సంపాదించాలని కాకుండా ఉండే వ్యక్తని,అలాగే ఒక ప్రకటనలు చెయ్యరు. అడ్డమైన దారుల్లో వెళ్లకుండా డబ్బు సంపాదించకుండా ఉండే ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఈ విషయాన్ని ఇంతవరకు ఎవరు ఎందుకని చెప్పట్లేదు అని ఆ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసారు.
Top