బాలయ్య బాబు ఎవరో నాకు తెలియదు అని కామెంట్లు చేసినా 'యాత్ర' డైరెక్టర్..!

Written By Xappie Desk | Updated: February 03, 2019 15:49 IST
బాలయ్య బాబు ఎవరో నాకు తెలియదు అని  కామెంట్లు చేసినా 'యాత్ర' డైరెక్టర్..!

ఈ మధ్య సెల‌బ్రిటీలు బాగా వాడుతున్న ప‌దం.. ఆయ‌న ఎవ‌రో నాకు తెలిదండి. రాజ‌కీయ నాయ‌కులతో పాటు, ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా ప‌లు సంద‌ర్భాల‌లో ఆయ‌న ఎవ‌రో నాకు తెలియ‌దండి అని అంటోన్న సంగ‌తి తెలిసిందే. మొద‌ట ఈ ప‌దం వాడింది మాత్రం టీడీపీ ఎమ్మెల్యే ,హీరో బాల‌కృష్ణ. మీడియా ప‌వ‌న్ గురించి అడ‌గ్గా ఆయ‌న ఎవ‌రో నాకు తెలియ‌ద‌ని చెప్పి సంచ‌ల‌న‌మే సృష్టించారు. దీనికి కౌంట‌ర్‌గా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూడా బాల‌య్య ఎవ‌రో తెలియ‌ద‌ని చెప్పి పెద్ద వివాద‌మే తెర లేపాడు. నాగ‌బాబు ఇక్క‌డితో ఆగ‌కుండా బాల‌య్య‌పై కొన్ని సెటైరిక‌ల్ వీడియోల‌ను సైతం విడుద‌ల చేశాడు.
 
తాజాగా ఈ లిస్ట్‌లోకి వ‌చ్చి చేరాడు యాత్ర య ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ‌. ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త నేత డాక్ట‌ర్ వైఎస్ రాజశేఖ‌ర రెడ్డి రాజ‌కీయ జీవితంలోని ప్ర‌ముఖ ఘ‌ట్ట‌మైన పాదయాత్ర ఆధారంగా తెర‌కెక్కిన సినిమా ‘యాత్ర’. ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్ర‌ను మాళ‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్మూట్టి న‌టించారు. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు మ‌హి వి రాఘ‌వ‌. మ‌రికొద్ది రోజుల్లో ఈ సినిమా విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా సినిమా ప్ర‌మోష‌న్‌లో పాల్గొన్నాడు మ‌హి వి రాఘ‌వ‌. ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న ఈయ‌న బాల‌య్య అంటే ఎవ‌రో నాకు తెలియ‌దు అంటూ సంచ‌ల‌నం సృష్టించాడు. తాను బాల‌య్య సినిమాలు చూడ‌న‌ని.. అందుకే ఆయన పేరే చెబితే బాల‌య్య సినిమాలేవి గుర్తుకు రావంటున్నాడు మ‌హి. ఇప్పుడు ఈయ‌న మాట‌లు హాట్ టాపిక్ అయిపోయాయి. మ‌హి వి రాఘ‌వ చేసిన కామెంట్స్‌పై బాల‌య్య అభిమానులు మండిప‌డుతున్నారు. తీసింది ఒక్క సినిమానే. అప్పుడే బాల‌య్య‌ను అనే రేంజ్‌కు వెళ్లిపోయాడా అంటూ అత‌ని ఫైర్ అవుతున్నారు బాల‌య్య అభిమానులు. మ‌రి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
Top