తిరుపతిలో టిడిపి పార్టీ లీడర్ల పై తిరగబడ్డ ప్రజలు.. పరుగులు తీసినా నాయకులు..!

Advertisement

by Xappie Desk | February 03, 2019 15:58 IST
Follow Xappie
తిరుపతిలో టిడిపి పార్టీ లీడర్ల పై తిరగబడ్డ ప్రజలు.. పరుగులు తీసినా నాయకులు..!

అంతా బాగుంది……..80శాతం పైగా ప్రజలు తన పాలన పట్ల ఆనందం తట్టుకోలేకపోతున్నారు అని తన డబ్బా తానే కొట్టుకుంటూ పచ్చ మీడియాలో కూడా ప్రచారం చేయించుకుంటూ ప్రజల్లో భ్రమలు కలిగించే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుకు అప్పుడప్పుడు ఆ ప్రజలు మాత్రం నిజాలతో చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా చంద్రబాబు సొంత జిల్లాలోనే టిడిపి ఎమ్మెల్యేకు, చంద్రబాబుకు చుక్కలు కనిపించే రేంజ్‌లో ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. తిరుమలను ఉధ్ధరించానని చెప్పుకునే చంద్రబాబుకు వాస్తవాన్ని కళ్ళకు కట్టేలా తిట్ల వర్షం కురిపించారు.తిరుమల ప్రజలందరూ వాళ్ళ సమస్యలు తీర్చాలని రోజుల తరబడి నిరాహారదీక్షలు, ధర్నాలు చేస్తూ ఉన్నారు.
 
అయితే మీడియా మేనేజ్‌మెంట్ గురు చంద్రబాబు మాత్రం వాళ్ళ నిరసన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియకుండా మేనేజ్ చేస్తూ వచ్చారు. అయితే తాజాగా నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలకు తిరుపతి టిడిపి ఎమ్మెల్యే సుగుణమ్మ అడ్డంగా దొరికిపోయారు. ఆ దెబ్బతో ధర్నాలు, నిరాహారదీక్షలు చేస్తున్నవాళ్ళందరూ కూడా తిరుపతి టిడిపి ఎమ్మెల్యేను నిలదీశారు. ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియని సుగుణమ్మ……..మీ సమస్యలన్నింటినీ చంద్రబాబుకు చెప్తానని మాట ఇచ్చారు.
 
అప్పటి వరకూ నిరసన వ్యక్తం చేస్తున్న బాధితులు చంద్రబాబు పేరు విన్న తర్వాత మరికాస్త రెచ్చిపోయారు. సుగుణమ్మపైన, చంద్రబాబుపైన తిట్ల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే అన్నీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి కనీసం పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ఏదో చేస్తానంటే నమ్మాలా? అన్నీ అబద్ధాలే చెప్పే చంద్రబాబును ఎవరైనా నమ్ముతారా అసలు అంటూ బాధితులంతా ఒక్కసారిగా విమర్శల వర్షం కురిపిస్తూ రెచ్చిపోయారు. దాంతో సుగుణమ్మ షాక్ అయింది. ఆ వెంటనే పోలీసుల సపోర్ట్‌తో అక్కడి నుంచి బ్రతుకు జీవుడా అనుకుంటూ తప్పించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు ఆ టిడిపి ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశాడని టిడిపి నాయకులు చెప్తున్నారు.
 
టిడిపి ఎమ్మెల్యేలు, మంత్రులతో సహా చంద్రబాబు అయినా సరే ఇప్పుడు ప్రజల మధ్యకు సెక్యూరిటీ లేకుండా వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ సంఘటన కళ్ళకు కట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు పాలనపైన ప్రజలకు ఏ స్థాయిలో కోపం ఉందో ఇప్పటికైనా టిడిపి నేతలు అర్థం చేసుకుంటారేమో చూడాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పచ్చ మీడియాలో అంతా సూపర్, ప్రజలంతా ఆనందం తట్టుకోలేకపోతున్నారు అని ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు గుడ్డిగా నమ్మేసి ఓట్లేస్తారనుకుంటే 2019 ఎన్నికల తర్వాత మళ్ళీ కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయం అని రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.


Advertisement


Advertisement

Top