తాజాగా ఇటీవల ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ వెళ్లారు. ఈ పర్యటనలో ముఖ్యంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల విషయంలో అధికార పార్టీ టిడిపి కొన్ని అవకతవకలకు పాల్పడుతున్నట్లు ముఖ్యంగా వైసిపి పార్టీకి చెందిన ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని చంద్రబాబు నిర్వహిస్తున్నట్లు ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు జగన్. ముఖ్యంగా సర్వేల పేరిట అధికార పార్టీకి చెందిన మనుషులు వచ్చి వైసీపీ పార్టీ కి చెందిన ఓట్లను తొలగించే కార్యక్రమం చేపడుతున్నట్లు కొన్నిచోట్ల విషయం వెలుగులోకి రావడం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సర్వేల ద్వారా ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు అనేది అంచనా వేస్తాయి బృందాలు. సర్వేలో ఆ ప్రాంతంలోని ఓటర్లు టీడీపీకి అనుకూలంగా ఉంటే సరే అలా కాకుండా అక్కడ ఒడిపొయే ప్రమాదం ఉందని అనిపిస్తే సర్వేల్లో ఎవరైతే వైకాపా మద్దతుదారులు ఉన్నారో వారి ఓట్లను జాబితా నుండి తొలగించేస్తారట. ఇలా ఇప్పటికే చాలా ఓట్లు గల్లంతయ్యాయని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరొరాను కలిసి బాబు అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నారని పిర్యాధు చేయాలని జగన్ ఢిల్లీ చేరుకున్నారు. దీంతో జగన్ ఢిల్లీ పర్యటన రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది.