త్వరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థలను తమ ప్రత్యర్థి పార్టీలపై నాయకులపై ఉసిగొల్పుతోందని సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల పశ్చిమబెంగాల్లో సిపిఐ జాతీయ దర్యాప్తు సంస్థ వ్యవహరించిన తీరుపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కోల్‌కతా సీపీ రాజీవ్‌కుమార్‌ను విచారించేందుకు ఆయన ఇంటికి సుమారు 40 మందికి పైగా సీబీఐ అధికారులు వెళ్లడం.. అక్కడి పోలీసులు వారిని అడ్డుకున్న నేపథ్యంలో అక్కడి పరిణామాలపై చంద్రబాబు స్పందించారు.
మన వ్యవస్థలను నాశనం చేయడంలో బీజేపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇది బీజేపీ పాలనకు పరాకాష్ట అని చంద్రబాబు అన్నారు. ఎన్నికలు జరుగుతున్నా తరుణం లో ఇలా జరగడం చాల బాధాకరం అని. మమతా బెనర్జీ కి మేమందరం కూడా అండగా ఉంటామని చంద్రబాబు అన్నారు. అంతే కాకుండా సమాఖ్య స్ఫూర్తి, రాజ్యాంగాన్ని రక్షించేందుకు ఆమెకు మద్దతిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కి అసలు డిపాజిట్లు కూడా దొరకవని, ఇంతటి నీచపు పాలన చూసి ప్రజలు విసిగిపోయారని, ఇకనైనా ఇలాంటి పనులు ఆపండి అని చంద్రబాబు అన్నారు. త్వరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రజలు బిజెపి పార్టీకి తగిన విధంగా బుద్ధి చెబుతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.