జగన్ చేస్తున్న ఆరోపణకు కౌంటర్ ఇవ్వలేకపోతున్న చంద్రబాబు..?

Written By Xappie Desk | Updated: February 05, 2019 12:57 IST
జగన్ చేస్తున్న ఆరోపణకు కౌంటర్ ఇవ్వలేకపోతున్న చంద్రబాబు..?

రాజకీయాలలో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ముఖ్యంగా విదేశాల పర్యటన కోసం తన సామాజిక చెందిన నేతలను వెంటబెట్టుకుని వెళతారని ఇలా అనేక కామెంట్లు రాజకీయాలలో చంద్రబాబు చేస్తున్న రాజకీయాలపై వినబడుతుంటాయి. ఈ క్రమంలో ఇటీవల తాజాగా ఎపిలో ఒకే కులానికి చెందిన వారికి పోలీస్ ప్రమోషన్ లు వచ్చాయన్న ఆరోపణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా సమాదానం ఇచ్చినట్లు కనిపించలేదు. ఆయన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారని టిడిపికి మద్దతు ఇచ్చే మీడియాలో దీనిపై ఒక లీక్ కదనం వచ్చింది. అందులో ఒక భాగం ఇలా ఉంది.
 
'తన పార్టీలో, ప్రభుత్వంలో అన్ని కులాలూ ఉన్నాయని.. జగన్‌ ఒక కులానికి వంతపాడుతున్నారని, అది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ‘కులాలకు, అధికారులకు సంబంధమేంటి..? ఏ కులానికి చెందిన కార్యదర్శులు ఎక్కువగా ఉన్నారు..? దాదాపు అన్నికులాల వాళ్లు ఉన్నారు. మంత్రుల్లో నలుగురు రెడ్లు ఉన్నారు. ఏకులానికి అన్యాయం జరిగింది...? సామాజిక న్యాయం చేయడంలో నేను ముందుంటా’ అని స్పష్టం చేశారు."అని ఉంది. జగన్ అడిగిన ప్రశ్నకు నేరుగా సమాదానం ఇచ్చినట్లు కనిపించలేదు.
 
ఇంతకీ ఒకే కులంవారు 37 మందికి డిఎప్సిలకు గాను, ముప్పై ఐదు మంది తన సామాజికవర్గం వారు కాదని చెప్పినట్లు అనిపించలేదు. మొత్తం మీద చంద్రబాబుపై జగన్ చేసిన ఆరోపణలకు సరైన సమాధానం చంద్రబాబు ఇవ్వలేకపోతున్నారని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు పేర్కొంటున్నారు. మామూలుగానే ప్రజలకు చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయాలు అర్థం అవుతున్నాయని మరికొంతమంది వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు.
Top