చంద్రబాబు డైలాగ్ ను ఫాలో అవుతున్న స్పీకర్ కోడెల..!

Written By Xappie Desk | Updated: February 05, 2019 13:01 IST
చంద్రబాబు డైలాగ్ ను ఫాలో అవుతున్న స్పీకర్ కోడెల..!

ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ కోడెల ఇటీవల గుంటూరు పరిసర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల ప్రతిపక్షనేత జగన్ మరియు వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది నేతలు తనపై చేస్తున్న అవినీతి ఆరోపణల విషయంలో చాలా సీరియస్ గా స్పందించారు. నా నియోజకవర్గంలో నా పరిపాలనలో ఎక్కడ అవినీతి జరిగిందో వాటి గురించి బహిరంగంగా చర్చకు రావాలని సవాల్ విసిరారు.
 
అంతేకాకుండా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిప్పు డైలాగును స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా అందుకున్నట్లు ఉన్నారు. తాను నిప్పులా నలభై ఏళ్లు బతికానని,తనపై ప్రతిపక్ష నేత జగన్ అవినీతి ఆరోపణలు చేయడం శోచనీయమని అన్నారని కదనం. అవినీతిలో ఉన్నవారికి అంతా అలాగే కనిపిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.తప్పు చేయాల్సి వస్తే రాజకీయాలు వదలి వెళతానని , తప్పు చే్స్తే నిరూపించాలని ఆయన అన్నారు.దైర్యం ఉంటే ఎదురుగా మాట్లాడాలని, జగన్ రమ్మన్న చోటుకు వస్తానని కూడా ఆయన అన్నారు. అంత నిప్పు అయితే ఇరవైమూడు మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఎందుకు చర్య తీసుకోలేదో? ఆయన కుమారుడిపై అనేక ఆరోపణలు వస్తే ఇంతకాలం ఎందుకు స్పందించలేదబ్బా! అని విపక్ష పార్టీకి చెందిన నేతలు స్పీకర్ కోడెల చేసిన కామెంట్లపై సెటైర్లు వేస్తున్నారు.
Top