ఈసారి ఎన్డీఏలోకి వస్తామని బాబు అంటే ఊరుకోం సీరియస్ అయిన అమిత్ షా..!

Written By Xappie Desk | Updated: February 05, 2019 13:11 IST
ఈసారి ఎన్డీఏలోకి వస్తామని బాబు అంటే ఊరుకోం సీరియస్ అయిన అమిత్ షా..!

2014 ఎన్నికల్లో బిజెపి పార్టీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నఆ సమయంలో దేశంలో మోడీ గాలి బాగా వేయడంతో కొన్ని ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు తర్వాత నాలుగు సంవత్సరాల బిజెపి పార్టీతో చేతులు కలిపి ఇటీవల కొన్ని అనివార్య కారణాలవల్ల ఎన్నికల ముందు ఎన్డీయే కూటమి నుండి బయటికి వచ్చి బీజేపీయేతర కూటమి కోసం దేశంలో విశ్వప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు. దీంతో చంద్రబాబు చేస్తున్న రాజకీయాలపై బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మండిపడ్డారు. ఎపికి బిజెపి ఏమీ చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని బిజెపి అద్యక్షుడు అమిత్ షా చెప్పారు.
 
కీలకమైన పద్నాలుగు అంశాలలో పదింటిని ఇప్పటికే పూర్తి ఏయడం జరిగిందని, వీటిపై చంద్రబాబు చర్చకు సిద్దమా అని ఆయన అన్నారు. విజయనగరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మహాకూటమి అంటూ కొత్తపల్లవి అందుకున్నారని ఆయన అన్నారు. మోడీ ప్రధాని అవడం తద్యమని, అప్పుడు చంద్రబాబు మళ్లీ ఎన్.డి.ఎ.లోకి రావడానికి ప్రయత్నిస్తారని, కాని ఆయనను ఈసారి రానివ్వబోమని అమిత్ షా అన్నారు. ఎపికి ఇచ్చిన వివిధ యూనివర్శిటీలు, కేంద్ర సంస్తలను వివరాలతో చెప్పారు. గత కాంగ్రెస్ హయాంలో ఐదేళ్లలో లక్షా పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇస్తే, మోడీ ప్రభుత్వం రెండు లక్షల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చిందని ఆయన అన్నారు. అంతేకాక రెవెన్యూ లోటు కింద డబ్బులు ఇచ్చామని ఆయన అన్నారు.వివిధ పదకాల కింద అన్ని లెక్కలు కలిపి ఎపికి 5.56 లక్షల కోట్ల రూపాయలు ఎపికి ఇవ్వడం జరిగిందని షా వెల్లడించారు.
Top