బ్యాలెట్ పద్దతినే తీసుకురావాలి అంటున్న చంద్రబాబు..!

Advertisement

by Xappie Desk | February 05, 2019 13:15 IST
Follow Xappie
బ్యాలెట్ పద్దతినే తీసుకురావాలి అంటున్న చంద్రబాబు..!

ఇటీవల దేశంలో జరుగుతున్న ఎన్నికల విషయంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతుందని జాతీయ రాజకీయాలలో ను మరియు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో జరిగిన ఎన్నికల విషయంలో ఆయా పార్టీలకు చెందిన నేతలు కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఇదే విషయమై 23 పార్టీలకు చెందిన ప్రతినిధులమంతా ఎన్నికల సంఘం అధికారులను కలిశామని తెదేపా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సాంకేతికంగా ముందున్న దేశాలు సైతం పేపర్‌ బ్యాలెట్‌ పద్ధతే పాటిస్తున్నాయని ఆయన అన్నారు.
 
పోలైన ఓట్లలో వీవీప్యాట్‌ స్లిప్పులు ఒక్కశాతం మాత్రమే లెక్కిస్తున్నారని.. ఈవీఎంలలో అవకతవకలపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఈసీపై ఉందని చెప్పారు. ఎన్నికల సంఘం సరైన నిర్ణయం తీసుకుంటుందనే విశ్వాసం తమకు ఉందని చంద్రబాబు తెలిపారు. ఈవిఎమ్ ల పై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసినవారిలో ఆయన కూడా ఉన్నారు. అయితే మరోపక్క ఇటీవల ఆంధ్ర రాష్ట్రం లో వైసీపీ పార్టీ కి చెందిన ఓట్లను తొలగించే కార్యక్రమం అధికార పార్టీ చేపట్టిందని ఆరోపణలపై ఢిల్లీలో ఉన్న ఈసీకి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన జగన్ మీడియాతో మాట్లాడుతూ బ్యాలెట్ విషయంలో చంద్రబాబు చూపిస్తున్న అత్యుత్సాహం పై సెటైర్లు వేశారు. 2014 ఎన్నికల్లో కేవలం రెండు పర్సంటేజ్ ఓట్ల తేడాతో మాపైన చంద్రబాబు గెలిచారని ఆ సమయంలో నేను ఈవీఎంలు ట్యాంపరింగ్ పై ఫిర్యాదు చేశానా..? అని ప్రశ్నించారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని జగన్ పేర్కొన్నారు.


Advertisement


Advertisement

Top