మాకొద్దు బాబు చంద్రబాబు తో పొత్తు అంటున్న కాంగ్రెస్..!

Written By Xappie Desk | Updated: February 06, 2019 12:27 IST
మాకొద్దు బాబు చంద్రబాబు తో పొత్తు అంటున్న కాంగ్రెస్..!

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కచ్చితంగా ఆ సమయంలో ఏర్పడిన మహాకూటమి అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు. దీంతో తీరా ఫలితాలు చూస్తే తెలంగాణ ప్రజలు మహాకూటమి సభ్యులకు సరైన రీతిలో నే తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పారని చాలామంది పేర్కొన్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ అంత మెజారిటీ కి రావడం చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అని చాలామంది సీనియర్ రాజకీయ నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ఇది ఇలా ఉండగా తాజాగా ఇటీవల తెలుగుదేశం పార్టీతో పొత్తు ఏమైనా ఉపయోగం జరిగిందా అని ఎఐసిసి అదినేత రాహుల్ గాంధీ ఆరా తీశారట.
 
తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఆయన భేటీ అయ్యారు. వచ్చే లోక్ సభ ఎన్నికలకు సన్నద్దం అవడంపై వారితో ఆయన సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలు చెప్పాలని రాహుల్ గాంధీ కోరారట. ఈ సందర్భంగా చంద్రబాబుతో పొత్తు వల్ల ప్రయోజనం జరిగిందా అని రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను వాకబ్ చేశారు. వారిలో అదికులు చంద్రబాబు తో పొత్తువల్లే ఓడిపోయామని అబిప్రాయపడ్డారని కధనం. లోక్ సభ ఎన్నికలలో టిడిపితో పొత్తు అనవసరమని వారు అబిప్రాయపడ్డారని సమాచారం. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఉద్యమాలుగా మలచలేకపోయామని నేతలు వివరించారు. చివరి నిమిషం వరకు టికెట్ల ఖరారు జాప్యం చేయడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని వివరణ ఇచ్చారు. మొత్తంమీద రానున్న ఏపీలో ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ టిడిపి తో కలిసే ప్రసక్తి లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం.
Top