వైసీపీలోకి ఆమంచి..?

Written By Xappie Desk | Updated: February 06, 2019 12:36 IST
వైసీపీలోకి ఆమంచి..?

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది ఆంధ్ర రాజకీయ సమీకరణాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ హవా కొనసాగుతున్న క్రమంలో చాలా మంది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేయాలని భావిస్తున్న వారు మరియు రాజకీయ భవిష్యత్తు కోసం వెంపర్లాడుతున్న ఇతర పార్టీకి చెందిన నాయకులు వైసిపి పార్టీ ఆఫీస్ ముందు క్యూ కడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరవచ్చని మీడియాలో కదనాలు వచ్చాయి. ఆయన ప్రస్తుతం టిడిపిలో ఉన్నారు.
 
గత ఎన్నికలలో నవోదయ పార్టీ పేరుతో స్వతంత్ర అబ్యర్దిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత టిడిపిలో చేరారు. కాగా తాజా పరిణామాలలో ఆయన వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చరే విషయమై తన ముఖ్య అనుచరులతో చర్చలు జరపుతున్నారని కధనం. ఈనెల 13న వైకాపా అధ్యక్షుడు జగన్‌ ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా ఆమంచి‌ ఆ పార్టీలో చేరే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికలలో వైసిపి మరియు టిడిపి పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న క్రమంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఆంధ్ర రాష్ట్ర రాజకీయ నాయకులకు ఆశ్చర్యం కలిగించారు ఆమంచి. ఈ క్రమంలో త్వరలో ఎన్నికలు ఏపీ లో రాబోతున్న నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు ముఖ్యంగా టిడిపిలో తగిన ప్రాధాన్యం లభించని నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Top