వైసిపి ఎమ్మెల్యే ని చంపాలని చూసి అడ్డంగా దొరికిపోయిన అధికార పార్టీ నేతలు..!

Written By Xappie Desk | Updated: February 06, 2019 14:33 IST
వైసిపి ఎమ్మెల్యే ని చంపాలని చూసి అడ్డంగా దొరికిపోయిన అధికార పార్టీ నేతలు..!

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హత్యకు అధికార టీడీపీ నాయకులు చేసిన కుట్ర బట్టబయలైంది. చెవిరెడ్డిపై దాడి చేయాలని స్థానిక టీడీపీ నేత పులివర్తి నాని గత కొద్ది నెలలుగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా చెవిరెడ్డికి సంబంధించిన ప్రతి కదలికను తెలిపేలా ఆయన దగ్గర ఇద్దరు డ్రైవర్లను నియమించారు. డ్రైవర్లు ఇచ్చిన సమాచారంతో అదును చూసుకుని దాడి చేయాలని భావించారు. అయితే స్థానిక మహిళలు, అభిమానులే వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేకు భద్రతగా నిలవడంతో నాని వ్యూహం రివర్సయింది. టీడీపీ కుట్రను చెవిరెడ్డి ఆధారాలతో బయటపెట్టారు.
 
తన దగ్గర చేరిన ఇద్దరు డ్రైవర్లను పోలీసులకు అప్పగించారు. ఒక్కొక్కరికి 15 లక్షలు ఇచ్చి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సంబంధించిన కదలికలు గమనించి పులివర్తి నానికి ప్రతి క్షణం అందించడమే తమ పని అని నాగభూషణం, సిసింద్రీ అనే ఇద్దరు డ్రైవర్లు తెలిపారు. మంగళవారం మీడియాతో ఇద్దరు డ్రైవర్లు మాట్లాడుతూ.. ‘పులివర్తి నాని మాకు చాలా బాగా తెలుసు. ఆయన పంపితేనే మేము నెలరోజుల కింద చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద డ్రైవర్లుగా చేరాం. ప్రతీ క్షణం ఎమ్మెల్యే కదలికలను గమనించి నానికి అందిచడమే మా పని. ఇలా చెప్పినందుకు ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాము. గతంలో మేము చిత్తూరులో ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు పైలట్‌గా పనిచేశామని ఇద్దరు డ్రైవర్లు వివరించారు.
Top