అంగరంగ వైభవంగా రెడీ అవుతున్న జగన్ బీసీ సభ..!

By Xappie Desk, February 06, 2019 14:39 IST

అంగరంగ వైభవంగా రెడీ అవుతున్న జగన్ బీసీ సభ..!

ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఒకపక్క ప్రత్యర్థి పార్టీ లకు చుక్కలు చూపిస్తూ మరోపక్క వైసీపీ పార్టీ కి మద్దతుగా ఉండే ఓటర్ల విషయంలో జరుగుతున్న అవకతవకలను ఎదుర్కొంటూ బిజీ బిజీగా గడుపుతున్న వైసీపీ అధినేత జగన్ బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకులతో మరియు ప్రజలతో కలిసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ‘అన్న పిలుపు’ కార్యక్రమంలో తటస్థులు పాల్గొననున్నారని ఆ పార్టీ మీడియా విభాగం నుండి వస్తున్న సమాచారం. తిరుపతి రూరల్‌ మండలం తనపల్లి క్రాస్‌ రోడ్డు సమీపంలోని పీఎల్‌ఆర్‌ గార్డెన్‌లో మరికొద్ది గంటల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని పేర్కొంది.
 
అనంతరం తిరుపతి వేదికగా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలో జరగనున్న ‘సమర శంఖారావ సదస్సు’కు మీడియా మిత్రులందరూ తప్పక హాజరుకావాలని మీడియా సెల్‌ మనవి చేసింది. తిరుపతిలోని యోగానంద్‌ ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలో సమర శంఖారావ సదస్సు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, చిత్తూరు జిల్లా బూత్‌ కన్వీనర్లతో వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారు. మొత్తంమీద ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్ అద్భుతమైన వ్యూహాలు వేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే తాజాగా జరగబోయే బీసీ భారీ బహిరంగ సభను వైసీపీ అధినేత జగన్ కీలకంగా తీసుకున్నారని ముఖ్యంగా బీసీలకు అధికార పార్టీ చేసిన మోసాలను ఈ సభలో వైఎస్ జగన్ కడిగి పారేస్తారని మరి అదే క్రమంలో వైసిపి పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు చేయబోయే కార్యక్రమాలను వివరిస్తారని సమాచారం.Top