చంద్రబాబుకి చెమటలు పట్టిస్తున్న జగన్..!

Written By Xappie Desk | Updated: February 08, 2019 09:35 IST
చంద్రబాబుకి చెమటలు పట్టిస్తున్న జగన్..!

ప్రజా సంకల్ప పాదయాత్ర తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడిని మొదలుపెట్టి ఆంధ్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన వైసీపీ అధినేత జగన్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కి చెమటలు పట్టిస్తున్నారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వ్యూహాలు ప్రతివ్యూహాలతో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తూ ప్రజల నమ్మకాన్ని అందుకుంటున్నారు జగన్. ఈ క్రమంలో ఇటీవల పాదయాత్ర పూర్తి చేసుకున్న జగన్ కొన్ని కొన్ని చోట్ల భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న అవినీతిని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఎండగడుతున్నారు.
 
ఈ నేపథ్యంలో తాజాగా ఇటీవల కడప లో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జగన్. ఈ సభలో జగన్ మాట్లాడుతూ..మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తాజాగా విడుదల చేసినటువంటి ఆరో బడ్జెట్ అనే కొత్త సినిమా చాలా దారుణంగా ప్లాప్ అయ్యిందని జగన్ ఎద్దేవా చేశారు. ఎదో పేరుకు బడ్జెట్ తయారు చేపించి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుందామని చూశారు కానీ, అది చాలా డివైడ్ టాక్ తెచ్చుకుందని జగన్ అన్నారు. ఇప్పటికి కూడా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని జగన్ మంది పడుతున్నారు. తన తల్లికి అన్నం పెట్టనివాడు… చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట… ఆలా ఉంది చంద్రబాబు పరిస్థితి అని జగన్ ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాకుండా ఉక్కు ఫ్యాక్టరీ బాధ్యత అంత కూడా తానే తీసుకోని, అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే శంకుస్థాపన చేసి, మరో ముడేళ్ళల్లో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తీ చేస్తామని జగన్ అన్నారు.
Top