మరో కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకు వచ్చిన జగన్..!

Written By Xappie Desk | Updated: February 08, 2019 09:43 IST
మరో కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకు వచ్చిన జగన్..!

నిన్ను నమ్మ బాబు అంటూ పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు చేస్తున్న అవినీతి గురించి ప్రసంగిస్తూ వైసీపీ అధినేత జగన్ నినదించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల విషయంలో అశ్రద్ధగా వ్యవహరించి స్వార్థ రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చారు అంటూ చంద్రబాబు పాదయాత్రలో జగన్ తీవ్ర స్థాయిలో మండిపడి ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు అబద్దాలు చెబుతారు మోసం చేస్తారు అంటూ ప్రజలను చైతన్య పరుస్తూ నిన్ను నమ్మం బాబు అని పాదయాత్ర చివరి భారీ బహిరంగ సభలో ప్రజలకు ఈ నినాదాన్ని అందించారు జగన్.
 
అయితే తాజాగా ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో వైసిపి పార్టీ హవా కొనసాగుతున్న క్రమంలో పలుచోట్ల వైసీపీ పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తూ సరికొత్త నినాదాన్ని ఆంధ్ర ప్రజలకు అందించారు. ఇటీవల కడప జిల్లాలో జరిగిన సమర శంఖం భారీ బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారం లోకి రావడం ఖాయం… ఇక మీదట ప్రజలు ఎలాంటి కష్టాలకి లోనవ్వరని, రాష్ట్రంలో అసలు కరువు సమస్య అనేదే రానివ్వనని జగన్ హామీ ఇచ్చారు. తన తండ్రి రాజశేఖర రెడ్డి చనిపోతూ తనకు పెద్ద కుటుంబాన్ని (ప్రజలు) ఇచ్చారని, ప్రజలందరూ కూడా తన దైర్యం అని జగన్ అన్నారు.
 
ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా తనను సొంత వాడిలా, ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఆదరించారని… మీ ఋణం ఎన్నటికీ కూడా తీర్చుకోలేరని జగన్ అన్నారు. మీ అందరికి కూడా నేను అండగా ఉంటానని, రాష్ట్రంలోని ప్రతిఒక్కరి కళ్ళల్లో ఆనందాన్ని నింపేవరకు కృషి చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఇదే క్రమంలో వైసీపీ పార్టీ కార్యకర్తలకు అన్న వస్తున్నాడు మంచి రోజులు వస్తాయని చంద్రబాబు ప్రభుత్వంలో మోసపోయిన ప్రతి సామాన్యుడికి తెలియజేయాలని సరికొత్త నినాదాన్ని తెరపైకి తీసుకు వచ్చారు.
Top