ఎల్లో మీడియా ని టార్గెట్ చేసిన నాగబాబు..!

By Xappie Desk, February 08, 2019 09:45 IST

ఎల్లో మీడియా ని టార్గెట్ చేసిన నాగబాబు..!

ఇటీవల సోషల్ మీడియాలో నాగబాబు కొన్ని వీడియోలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్షన్ ఫీవర్ అంతటా అలుముకున్న నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ పై పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన నాగబాబు తర్వాత వైసీపీ అధినేత జగన్ ని టార్గెట్ చేశారు. అయితే తాజాగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపే మీడియా ని గట్టిగా టార్గెట్ చేశారు మెగా బ్రదర్ నాగబాబు. ఇటీవల టీడీపీకి భజన చేసే ఓ ఎల్లో మీడియా ఛానల్ పై గట్టిగానే సెటైర్లు వేసారు.వారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి మరియు అలాగే ఆయన తనయుడు నారా లోకేష్ కి వారు ఏ రేంజ్ లో భజన చేస్తున్నారో ఒక వీడియో తీసి పెడితే దానికి అనూహ్యమైన స్పందన కూడా వచ్చింది.
 
అయితే ఆ వీడియోలో మా ఛానెల్ పేరు వాడి చేసారు అని వారు ఆ వీడియోని తీయించేసారు. దానికి ఇటీవల నాగబాబు ఇచ్చిన రియాక్షన్ మాత్రం వేరే రేంజ్ లో ఉందని చెప్పాల్సిందే.. ముందు వారికి భయపడిపోయినట్టుగా మాట్లాడి ఆ తర్వాత అసలు కథ మొదలు పెట్టారు. మీ ఛానెల్ లో వారి తల్లిని దూషించిన మాట తప్పు కాదు అని అంటారు కానీ వారు చేసిన వీడియోనే కాస్త సెటైరికల్ గా తీస్తే మాత్రం అది తప్పా అని ప్రశ్నించారు. తన వీడియోస్ ని ఆపగలరేమో కానీ తన ప్రయాణాన్ని ఎలా ఆపగలరంటూ కౌంటర్లు ఇచ్చారు.Top