ఊహించని విధంగా పగ తీర్చుకుంటున్న మమతా బెనర్జీ..!

Written By Xappie Desk | Updated: February 09, 2019 13:07 IST
ఊహించని విధంగా పగ తీర్చుకుంటున్న మమతా బెనర్జీ..!

ఇటీవల కేంద్రం ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు పశ్చిమబెంగాల్ పోలీసులను విచారించడానికి శారదా కుంభకోణం విషయమై వచ్చిన సంఘటన వారిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అడ్డుకోవడం జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం మనకందరికీ తెలిసినదే. తన రాస్ట్రంలోని పోలీసు అదికారులపై దాడులు చేయడానికి వీలులేదని, వారిని విచారించడానికి ఒప్పుకోబోమని చెప్పిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, సిబిఐ అదికారుల ఆస్తుల మీద రాష్ట్ర పోలీసులతో దాడులు చేయిస్తున్నారు. నాగేశ్వరరావు భార్య,కూతురు లకు చెందిన సంస్థలపై ఈ దాడులు చేశారు. ప్రతీకార దాడులుగానే వీటిని భావిస్తున్నారని కధనం. కేవలం పరిశీలన నిమిత్తం వచ్చామని కోల్‌కతా పోలీసులు చెబుతున్నా అసలు విషయం మాత్రం వేరుగా ఉందని అంటున్నారు. నాగేశ్వరరావు భార్య, కూతురు కు సంబందం ఉన్న ఓ కంపెనీ, సాల్ట్‌లేక్‌లో ఆయన భార్య ఆధ్వర్యంలో నడుస్తున్న ఏంజెలినా మెర్సంటైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ లపై ఈ దాడులు జరిగాయి. మొత్తంమీద మమతా బెనర్జీ సిబిఐ దాడులను అడ్డంపెట్టుకుని జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వంపై మచ్చ వెయ్యాలని చూస్తున్నారని మరోపక్క తన రాష్ట్రం లోకి అడుగుపెట్టిన సీబీఐ అధికారులకు ఊహించిన విధంగా మమతా బెనర్జీ పగ తీర్చుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.
Top