ఢిల్లీలో మోడీ కి చుక్కలు చూపించడానికి రెడీ అయిన చంద్రబాబు..!

Written By Xappie Desk | Updated: February 09, 2019 13:11 IST
ఢిల్లీలో మోడీ కి చుక్కలు చూపించడానికి రెడీ అయిన చంద్రబాబు..!

ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ విధంగా మోసం చేసింది వంటి విషయాలను ఒకపక్క ప్రభుత్వ కార్యక్రమాలలోనూ పార్టీ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ ముందుకు దూసుకెళ్ళిపోతున్న టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు త్వరలో ఢిల్లీ లో ధర్మ పోరాట దీక్షకు పూనుకున్నారు. ముఖ్యంగా ఈ దీక్షలో అసలు విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది వంటి విషయాలను తెలియజేస్తూ నిరసనలు చేపట్టడానికి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు చంద్రబాబు. ముఖ్యంగా విభజన గాయంపై కారం చల్లి మోడీ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆయన అన్నారు.మోడీ ప్రస్టేషన్ లో ఉన్నారని, గుంటూరు వచ్చి ప్రస్టేషన్ లో మాట్లాడతారని ఆయన అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి ఏపీ వచ్చారని దేశమంతా తెలిసేలా నిరసనలు తెలపాలని ఆయన పార్టీకి పిలుపు ఇచ్చారు. . అంతా పసుపు చొక్కాలు ధరించి ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని కోరారు. గాంధీజీ స్పూర్తితో ద్రోహం చేసిన కేంద్ర పెద్దలు రాష్ట్రంలో పర్యటించి దినాలను చీకటి దినాలుగా భావించి కసి పట్టుదలతో అందరూ నిరసనలు తెలపాలని సూచించారు. అయితే మరోపక్క ఫిబ్రవరి 11 వ తారీకు ఢిల్లీలో చంద్రబాబు దీక్ష చేపట్టి మోడీకి అదే స్థాయిలో నిరసన సెగ తగిలేలా పక్కా ప్లాన్ చేస్తున్నారు.
Top