ఏపీలో బోగస్ ఓట్లు ఎత్తివేసే కార్యక్రమం...!

By Xappie Desk, February 09, 2019 13:15 IST

ఏపీలో బోగస్ ఓట్లు ఎత్తివేసే కార్యక్రమం...!

ఇటీవల వైసీపీ అధినేత జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కొన్ని బోగస్ ఓట్లు సృష్టించిందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి మనకందరికీ తెలిసినదే. ఈ పరిణామంతో ఎపిలో బోగస్ ఓట్లపై విచారణ చేస్తున్నట్లు సిఇఓ ద్వివేది తెలిరారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది అంబటి రాంబాబు చెప్పారు. విచారణ 15 రోజుల్లో పూర్తవుతుందన్నారు. రాజకీయ పార్టీల నేతలతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల్‌కృష్ణ ద్వివేది శుక్రవారం భేటీ అయ్యారు. సీపీఎం, సీపీఐ, బీజేపీ నాయకులతో పాటు వైఎస్సార్‌ సీపీ తరపున అంబటి రాంబాబు హాజరయ్యారు. ఓటర్ల నమోదు ప్రక్రియ సమర్థవంతంగా జరగాలని సూచించినట్టు చెప్పారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రావాలని ద్వివేది కోరినట్టు తెలిపారు. భారీగా క్యూలైన్‌ కాకుండా టోకెన్‌ పద్ధతిని ప్రవేశపెట్టే విషయంపై సమావేశంలో చర్చ జరిగిందన్నారు. రాష్ట్రంలో 1.15 లక్షల ఈవీఎంలు ఉన్నాయన్నాయని, ఈవీఎంల మొదటి దశ తనిఖీలు జరుగుతున్నట్టు ద్వివేది తెలిపారు. ఈవీఎంల తనిఖీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొనాలని కోరారు.Top