వైసీపీ పార్టీ అధినేత జగన్ తండ్రి వైయస్సార్ చేపట్టిన పాదయాత్రను మూలకథ గా తీసుకుని యాత్ర అనే సినిమాను తీశారు. తాజాగా ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా రాజకీయాలకతీతంగా ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో దోచుకుంది. ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా తనను నమ్ముకున్న ప్రజలను ఆదుకోవాలి వంటి విషయాలను చాలా అద్భుతంగా చూపించారు ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మమ్ముట్టి జీవించిన ఈ బయోపిక్ తొలి రోజే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్న వేళ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ చిత్రాన్ని ఓ టీడీపీ నేత శుక్రవారం చూసి భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టీడీపీ నాయకుడు అత్తోట చంటి `యాత్ర` సినిమా చూస్తూ భావోద్వేగానికి లోనయ్యారట. ఆయన కంట కన్నీరు కారుతున్న ఓ ఫొటోను వైఎస్సార్‌సీపీ పేరుతో వున్న ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ ఫొటో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇతి ఎంత వరకు నిజం అన్నది పక్కన పెట్టి వైఎస్ అభిమానులు ఈ పిక్‌ని సోషల్ మీడియా అంతటా వైరల్ చేస్తున్నారు. శుక్రవారం విడుదలైన `యాత్ర` అన్ని ఏరియాల్లోనూ భారీ ఓపెనింగ్స్ సాధించింది. కడపతో పాటు అంతటా హౌస్‌ఫుల్ కావడం విశేషం. మొత్తం మీద ఎలక్షన్ ముందు వచ్చిన ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఓటర్ ను ప్రభావితం చేసే టట్లు ఉంది అని అంటున్నారు సినిమా విశ్లేషకులు.