రోజు రోజుకి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఏపీ రాజకీయాన్ని రసవత్తరం చేస్తున్న చంద్రబాబు..!

By Xappie Desk, February 09, 2019 13:28 IST

రోజు రోజుకి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఏపీ రాజకీయాన్ని రసవత్తరం చేస్తున్న చంద్రబాబు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితుల విషయమై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే బాధితుల కోసం ఏపీ ప్రభుత్వం 250 కోట్లను మంజూరు చేసిన విషయం మనకందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో తాజాగా మరో సారి చంద్రబాబు మరొక నిర్ణయం తీసుకున్నట్లు టిడిపి సోషల్ మీడియా ద్వారా వస్తున్న సమాచారం. ఈ మేరకు అగ్రిగోల్డ్ బాధితుల విషయమై టీడీపీ ఆఫీషియల్ పేజీ నుండి ట్వీట్ ద్వారా తెలిపారు. గతంలో అగ్రిగోల్డ్ నిర్వాకానికి మోసపోయి దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షలు చొప్పున రూ.5 కోట్లతో 100 మందికి గత మార్చి, 2018లోనే నష్టపరిహారం అందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పుడు తాజాగా ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.250 కోట్లు మంజూరు చేసింది. రూ.10 వేలు, అంతకంటే తక్కువ మొత్తాల్లో డిపాజిట్లు చేసిన వారికి డిపాజిట్‌ సొమ్మును తిరిగి చెల్లించేందుకు ఈ మొత్తాన్ని మంజూరు చేసింది అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం ద్వారా ఇప్పటివరకూ సమకూరిన రూ.50 కోట్లను కూడా కలిపి మొత్తం రూ.300 కోట్లను న్యాయస్థానం అనుమతితో బాధితులకు చెల్లించనుంది. దీనివల్ల 3.5 లక్షల మంది బాధితులకు ఊరట కలగనుంది.Top